తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన నికోలాయ్ సచ్ దేవ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. పెళ్లైనా వరలక్ష్మి సినిమాలకు దూరం కాకుండా యధావిధిగా వృత్తిని కొనసాగిస్తుంది. భర్త నుంచి అన్ని రకాల సహకారం..స్వేచ్ఛ లభించడంతోనే నటిగా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అభిమానులు భర్తను కూడా సినిమాల్లోకి తీసుకొస్తే బాగుంటుంది? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. నికోలాయ్ నటుడిగా అన్ని రకాలుగా అర్హుడంటూ పోస్టులు పెడుతున్నారు. నిజమే అందులో తప్పేముంది.
నికోలయ్ భారీ కటౌట్. విలన్ పాత్రలకు పర్పెక్ట్ గా సెట్ అవుతారు. ఒంటి చేత్తో నలుగుర్ని అలా విసిరేసే కటౌట్ అది. భారీ దేహం…హైట్…వెయిట్…కండలు తిరిగిన దేహంతో మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నారు. తాను సెలబ్రిటీ కాకపోయినా? అచ్చంగా సెలబ్రిటీనే తలపిస్తాడు. వరలక్ష్మిని వివాహం చేసుకోవడంతో తాను కూడా సెలబ్రిటీ అయిపోయాడనుకోండి. అతడు ఎక్కడ కనిపించినా మీడియా కవరేజ్ ఉంటుంది. ఇంటర్నెట్ లో ఫోటోలు వైలర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నికోలాయ్ విలన్ గా ప్రయత్నిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు.
ఎలాగూ బ్యాకెండ్ లో వరలక్ష్మి రిఫరెన్స్ ఉంటుంది. అత్త-మామలు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆ రకంగా కోలీవుడ్ నుంచి మంచి బ్యాకప్ ఉంటుంది. నికోలాయ్ కి బాలీవుడ్ లో మంచి పరిచయాలున్నాయి. జాన్ అబ్రహం, సుస్మితా సేన్ సహా చాలా మంది స్నేహితులున్నారు. జాన్ సినిమాలో విలన్ అవకాశం అడిగితే స్నేహితు కాదం టాడా? పైగా నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు. అతడి శరీరం నిండా టాట్టూలు దర్శనమిస్తాయి. మంచి బాడీ బిల్డర్. సినిమాకు పనికొచ్చే ప్రతీ క్వాలిటీ నికోలాయ్ లో ఉంది. అతడు వచ్చి ఓ ప్రయత్నం చేయడమే. అవకాశాలు ఇవ్వని వారుండరు.
ఒసారి నికోలాయ్ వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అతడు. ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నాడు. ఆన్ లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నటి వరలక్ష్మితో పద్నా లుగేళ్లుగా పరిచయం. ఆ పరిచయమే ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ దారి తీసింది. ప్రస్తుతం ఆ జోడీ ధాపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది.