ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Vanitha Vijaykumar : 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ!

Vanitha Vijaykumar : 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ!
ADVERTISEMENT

43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఫైర్ బ్రాండ్.. ముగ్గురు పిల్లలకు తల్లి..మూడు పెళ్ళిళ్ళు పెటాకులు..
ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ కావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ కొరియోగ్రాఫర్ తో తాను నాలుగవసారి ఏడడుగులు వేయబోతున్నానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది వనిత. మరి ఈ బ్యూటీ పెళ్లాడబోయేది ఎవరిని? గతంలో జరిగిన మూడు పెళ్లిళ్ల సంగతేంటి? ఈ నాలుగో పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత. ‘చంద్రలేఖ’ అనే సినిమాతో 1995లోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తమిళ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ‘చంద్రలేఖ’ సినిమా ప్లాప్ కావడంతో ఆ తర్వాత ‘మాణిక్యం’ అనే సినిమాలో నటించిన వనిత విజయ్ కుమార్ తెలుగులో ‘దేవి” అనే సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మరో మలయాళ సినిమాలో మెరిసింది. కానీ చేసిన సినిమాలు కంటే ఎక్కువగా ఈ అమ్మడు వ్యక్తిగత అంశాల వల్లనే వార్తల్లో నిలుస్తుంది.

2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఒక కొడుకు, కూతురుకి తల్లి అయింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా 2005లో ఆకాష్ తో విడాకులు తీసుకుంది. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో పుట్టిన ఇద్దరు పిల్లలే కాకుండా రెండో భర్తతో వనితకు మరో కూతురు పుట్టింది. ఆయనతో కూడా ఐదేళ్ల కాపురం చేశాక 2012లో డివోర్స్ తీసుకుంది. అనంతరం కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొన్నాళ్ళ పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అలాంటి టైంలో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ని 2020లో పెళ్ళాడి షాక్ ఇచ్చింది. ఆమె మూడో పెళ్లి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘అవసరమైతే నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాను’ అంటూ అందరి నోళ్ళు మూయించింది వనిత. కానీ ఈ మూడో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకుని కేవలం నాలుగు నెలల్లోనే మళ్లీ విడాకులు ఇవ్వడంతో మూడో పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత వనిత ఆయనతో తనకు అసలు పెళ్ళే జరగలేదని, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.

కోలీవుడ్ న‌టి వ‌నితా విజ‌య్ కుమార్ గురించి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె ఇప్పుడు ఓ సినిమాతో చాలా బిజీగా ఉంది. వ‌నితా మొన్నా మ‌ధ్య తెలుగులో వ‌చ్చిన మ‌ళ్లీ పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఇదిలా ఉంటే వ‌నిత సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

గ‌తేడాది అక్టోబ‌ర్ నుంచే వ‌నితా విజ‌య్ కుమార్, కొరియోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్త‌లొస్తున్నాయి. బీచ్ లో వ‌నితా, రాబర్ట్ కు ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్టు వ‌చ్చిన ఫోటోను చూసి అంద‌రూ ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింద‌ని అనుకున్నారు. కానీ ఆ త‌ర్వాత అది సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చేసిన పోస్ట‌ర్ అని తెలిసి సైలెంట్ అయ్యారు.

ఇదిలా ఉంటే మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ‌నిత తాజాగా మ‌రో పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. పెళ్లి చేసుకోవాల‌నే ఆశ‌తో ప్రేమ‌లో పడ్డాం. ఎప్ప‌టికీ క‌లిసి జీవించాల‌నే ఆశ‌తోనే పెళ్లి చేసుకున్నాం.. అస‌లు అరుణ్, విద్య ప్ర‌పంచంలో ఏం జ‌రిగిందంటూ ఓ ల‌వ్ కొటేష‌న్ ను రాస్తూ సినిమా పోస్ట‌ర్ ను షేర్ చేసింది. వ‌నిత ఆ పోస్ట‌ర్ ను షేర్ చేసిన కాసేప‌టికే అది నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ పోస్ట‌ర్ ను చూసిన నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు. వ‌నిత మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అని కొంద‌రు అంటుంటే, కాదు అదంతా సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అని మ‌రికొంద‌రంటున్నారు. మొత్తానికి ఆ పోస్ట్ దేనికి సంబంధించిన‌దైనా స‌రే వ‌నితా విజ‌య్ కుమార్ మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది.

అయితే తాజాగా వ‌నిత త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆ ఫోటోలో ఆమె పెళ్లి కూతురు గెట‌ప్ లో ఉంటే రాబ‌ర్ట్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో ఉన్నాడు. అది చూసే వ‌నిత నాలుగో పెళ్లికి రెడీ అయిందా అని అంద‌రూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె గ‌తంలో ఆకాష్, రాజ‌న్ ఆనంద్, పీట‌ర్ పాల్ తో పెళ్లి చేసుకుని వారి నుంచి విడిపోయింది. గ‌తంలో వ‌నిత మూడు పెళ్లిళ్లు చేసుకున్నందునే ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిందేమోన‌నే అనుమానాలొస్తున్నాయి. ఏదేమైనా సినిమా కంటే కూడా ఆమె పెళ్లి మీదే ఇప్పుడు అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంది.

Tags: #Vanithavijayakunarmarriage #VanithaVijayakumar #Choreographerrobert #Filmindustry #Vanitharobertmarriage #Kollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ramrajyam Raghav Reddy: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసు..వెలుగులోకి సంచలన విషయాలు..!

Next Post

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందే:సిఎం చంద్రబాబు

Related Posts

Tollywood
Entertainment

Tollywood:ప్రణీత సుభాష్ అందం, స్టైల్, క్లాస్ – ఎప్పటికీ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్

SathiLeelavathi,
Entertainment

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews
Latest

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

#Madhubala, #SaraArjun, #BollywoodBiopic, #Dhurandhar, #OTTRelease, #IndianCinema, #Biopic, #ClassicActress, #MughalEAzam, #FilmNews, #CinemaUpdates, #BollywoodNews, #ActressLife, #UpcomingMovie, #TrendingNews
Entertainment

SaraArjun:‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్..!

RukminiVasanth
Entertainment

RukminiVasanth:రుక్మిణి వసంత్ గోల్డ్ ఫోటోషూట్ వైరల్ | బంగారు కాంతిలో మెరిసిన టైమ్‌లెస్ బ్యూటీ

#RakulPreetSingh, #SaraAliKhan, #WamiqaGabbi, #PatiPatniAurWoh2, #BollywoodSong, #SongShoot, #DanceNumber, #Glamour, #BollywoodNews, #TrendingNow, #MovieUpdates, #IndianCinema, #Actresses, #Viral, #EntertainmentNews
Entertainment

Bollywood:పతి పత్నీ ఔర్ వో 2 పాట షూట్‌లో Rakul Preet Singh, Sara Ali Khan, Wamiqa Gabbi సందడి

Next Post
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందే:సిఎం చంద్రబాబు

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందే:సిఎం చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Tollywood

Tollywood:ప్రణీత సుభాష్ అందం, స్టైల్, క్లాస్ – ఎప్పటికీ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్

#SRH, #SunrisersHyderabad, #RR, #RajasthanRoyals, #IPL2025, #IPLUpdates, #IshanKishan, #JofraArcher, #KLRahul, #VaibhavSuryavanshi, #HighScoringMatch, #IPLThriller, #CricketNews, #T20Cricket, #RunChase, #CricketFans, #IPLRecords, #BattingDominance, #SixesAndFours, #IndianPremierLeague

IPL2026:రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం-ఇషాన్ కిషన్ ఫైర్ ఇన్నింగ్స్,

#ChandrababuNaidu, #NirmalaSitharaman, #EconomicTimes, #BusinessReformer2025, #AndhraPradesh, #APDevelopment, #InvestInAP, #GoogleInvestment, #Vizag, #Amaravati, #GreenEnergy, #EaseOfDoingBusiness, #StartupIndia, #ViksitBharat2047, #IndianEconomy

AndhraPradesh:చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు

#KalvakuntlaKavitha, #TRS, #TelanganaPolitics, #TelanganaNews, #FreeEducation, #FreeHealthcare, #FarmersFirst, #YouthEmployment, #SocialJustice, #BCReservations, #SCSTWelfare, #TelanganaDevelopment, #PoliticalUpdate, #IndiaPolitics, #TeluguNews

TRS:తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన Kalvakuntla Kavitha ఐదు హామీలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info