ఆసక్తికర నివేదిక ఒకటి విడుదలైంది. అందులో దేశంలోనే టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ఒక శాస్త్రీయ మదింపు చేసిన సంస్థ.. వారికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. దేశంలో 150 పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలను గుర్తించింది. వాటి విలువ రూ.16 లక్షల కోట్లను దాటినట్లుగా పేర్కొన్నారు. ఇంతకూ ఈ మదింపు చేసిన సంస్థ ప్రముఖ హురున్ రీసెర్చ్.. గ్రోహె సంస్థలు. తాజాగా వారు 2025కు సంబంధించి టాప్ 10 సంస్థల వివరాల్ని వెల్లడించారు.
జాబితాలోని రియల్ ఎస్టేట్ సంస్థ కనీస విలువ రూ.1000 కోట్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 150 కంపెనీల్లో 33 సంస్థలు సీఈవో ఆధ్వర్యంలో నడుస్తుండగా.. అందులో నాలుగు సంస్థలను మాత్రమే మహిళల్ని నడిపిస్తున్న వైనం వెలుగు చూసింది. ఇక.. ఈ జాబితాలోని 150 సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలు 13 వరకు ఉన్నాయి. ఈ పదమూడు సంస్థల విలువ రూ.93,700 కోట్లుగా లెక్క కట్టారు. నివేదికలో భాగంగా పరిగణలోకి తీసుకున్న 150 రియల్ ఎస్టేట్ సంస్థలున్న నగరాలను చూస్తే.. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలవటం గమనార్హం.
టాప్ 150 రియల్ ఎస్టేట్ సంస్థల్లో టాప్ 10 రియల్ కంపెనీలు.. అందులో టాప్ 1గా డీఎల్ఎఫ్ నిలిచింది. ఈ సంస్థకు చెందిన రాజీవ్ సింగ్ రూ.1.27 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలవగా.. మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా రూ.92,340 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పెనిన్సులా ల్యాండ్ అత్యంత దీర్ఘకాలిక చరిత్ర ఉన్న కంపెనీ. దీన్ని 1871లో స్థాపించటం విశేషం. అదే సమయంలో అత్యంత తక్కువ వయసున్న కంపెనీగా బెంగళూరుకు చెందిన స్కాలస్ నిలిచింది. దీపక్ పరేఖ్ దీని అధినేత. ఈ సంస్థ ఆరేళ్ల వ్యవధిలోనే రూ.13,600 కోట్లకు చేరటం గమనార్హం. ఇక.. రితేశ్ అగర్వాల్ కు చెందిన ఓయో తొలిసారి టాప్ 15లోకి చరింది.
టాప్ 10లోకి చూస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అపర్ణా కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ నిలిచింది. ఈ సంస్థకు చెందిన ఎస్. సుబ్రమణ్యం రెడ్డి, సి. వెంకటేశ్వర రెడ్డిలు నిలిచారు. వీరి ఆస్తుల విలువ రూ.18,690, రూ.18490 కోట్లుగా తేల్చారు. వీరిద్దరి ఆస్తుల విలువ రూ.37,400 కోట్లుగా తేల్చారు. టాప్ 10లో బెంగళూరుకు చెందిన వారు నలుగురు ఉంటే.. ముంబయి నుంచి ముగ్గురు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు.. అహ్మదాబాద్.. ఢిల్లీ నుంచి ఒక్కొక్కరు నిలిచారు. పదో ర్యాంకును ముగ్గురు షేర్ చేసుకోవటం గమనార్హం. టాప్ 10లో నిలిచిన సంస్థలు.. వాటి ఆస్తుల విలువను చూస్తే..
రియల్ ఎస్టేట్ సంస్థ వాటి విలువ రూ.కోట్లల్లో డీఎల్ఎఫ్ 2,07,400 లోధా 1,38,200 ఇండియన్ హోటల్స్ 1,08,300 ప్రెస్టీజ్ 71,500 గోద్రెజ్ ప్రాపర్టీస్ 70.600 ఓబెరాయ్ రియాల్టీ 69,400 ది ఫీనిక్స్ మిల్స్ 55,900 అదానీ రియాల్టీ 52,400 ఎం3ఎం ఇండియా 37,400 అపర్ణా కన్ స్ట్రక్షన్స్ 37,400