గులాబీ పార్టీలో ముళ్ళున్నాయి. అవి ఇంతవరకూ బయట వారికే గుచ్చుకునేవి. ఇపుడు సొంత వారినే గిచ్చి గిచ్చి పొడుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ అయిన కవిత గులాబీ పార్టీని ముల్లు మాదిరిగా తూట్లు పొడుస్తునారు ఈ నేపధ్యంలో ఆమె తన తండ్రి తన దైవం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ నే ఇరకాటంలోనూ ఇబ్బందిలోనూ నెడుతున్నారు అని అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నది బీఆర్ఎస్ గట్టి వాదన. అది ప్రజల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని కేసీఆర్ మానస పుత్రికగా తెలంగాణాను సస్య శ్యామలం చేసేందుకు పుట్టినది అన్నది వారి బలమైన భావన.
అయితే కవిత మాట్లాడుతున్నది చూస్తూంటే తన తండ్రికి అవినీతి మరకలు అంటించారు అని అంటున్నారు. అది హరీష్ రావు సంతోష్ అని పక్కన ఉండే పార్టీ కీలక నేతల పేర్లు చెబుతున్నారు. తన తండ్రికి డబ్బు కానీ మరోటి కానీ అవసరం లేదని కానీ వారే అవినీతి పనులు చేస్తూ తన తండ్రిని బదనాం చేస్తున్నారు అని ఆమె ఆరోపిస్తున్నారు ఈ విధంగా ఆమె చెప్పడం ద్వారా ఒక్క విషయం అయితే తేటతెల్లం చేస్తున్నారు అని అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది అని చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు.
కవితకు అయితే కేసీఆర్ తన తండ్రి అని ఆయనకు ఏమీ తెలియదు అని మినహాయింపులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కలిసే అవినీతి చేశారు భారీ ప్రాజెక్ట్ రూపంలో అతి పెద్ద గుదిబండను తెలంగాణాకు తగిలించారు అని అంటున్నారు అచ్చం కాంగ్రెస్ వాదననే కవిత తన నోటి వెంట వినిపిస్తున్నారా అన్నది కూడా చర్చగా సాగుతోంది. అయితే ఆమె కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తూ అదే సమయంలో బీఆర్ఎస్ లో తనకు పడని వారిని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఈ రకమైన కామెంట్స్ చేయడం వల్ల బీఆర్ఎస్ కి రెండిందాలుగా ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
బీఆర్ఎస్ అంతా ఒక్కటి అన్న భావన జనంలో ఉంటూ ఉండేది. కానీ అది నిజం కాదని అన్ని పార్టీల లాగానే అక్కడ కూడా విభేదాలు ఉన్నాయని అధికారం కోసం పదవుల కోసం కుమ్ములాటలు ఉన్నాయని అది కూడా కేసీఆర్ ఉండగానే ఇలా జరుగుతోందని కూడా అంతా అనుకునే నేపధ్యం ఉంది. ఇది పార్టీ పరంగా చూస్తే ఇమేజ్ ని డ్యామేజ్ చేసినట్లే అని అంటున్నారు. మరో వైపు బీఆర్ఎస్ కి ఇపుడు ఊపిరాడనీయని భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నది ఉంది
అవినీతి అన్నదే జరగలేదు అని బీఆర్ఎస్ బల్ల గుద్ది చెబుతూంటే కేసీఆర్ సొంత బిడ్డ మాత్రం అవినీతి జరిగింది తన తండ్రి పాత్ర లేదు వారే కారకులు అని కొన్ని పేర్లు చెబుతున్నారని ఫలితంగా బీఆర్ఎస్ మరింతగా బదనాం అవుతోంది అని అంటున్నారు. దీంతో బీఆర్ ఎస్ లో కవిత విమర్శలు అతి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అదే సమయంలో అధికార కాంగ్రెస్ కి మాత్రం ఈ పరిణామాలు ఖుషీగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి గులాబీ ముళ్ళను విప్పుకోవడం కానీ బీఆర్ఎస్ కారుకి పడిన పంచర్లను రిపేరు చేసుకోవడం కానీ ఆ పార్టీకి పెద్ద పనే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.