తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను (లోక్‌సభ నియోకవర్గాల అధ్యక్షులను) ప్రకటించింది. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శల జాబితాను సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను టీడీపీ అధిష్టానం అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు సంబంధించిన ఎంపికపై కసరత్తు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో నేతల సామాజిక సమీకరణలు, సామర్థ్యం, సీనియారిటీ ఆధారంగా ఈ ఎంపిక చేపట్టినట్టుగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలలో బీసీలు-8, మైనార్టీలు-1, ఓసీలు-11, ఎస్సీలు-4, ఎస్టీలు-1 ఉన్నారు.
టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ జాబితాను ఖరారు చేశారు. దీంతో టీడీపీ అధికారికంగా ప్రకటించింది. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం అధినేత చంద్రబాబు.. ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటుగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు.
తెలుగు తమ్ముళ్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. గ్రామ, మండల, జిల్లాల వారీగా కమిటీల నియామకం పూర్తైనప్పటికీ.. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఎంపిక మాత్రం గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి . లోక్‌సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లను, ప్రధాన కార్యదర్శులను ఆ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాకు అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలిపారు. దీంతో టీడీపీ అధిష్టానం కొత్త జిల్లా అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించింది.
జిల్లా అధ్యక్షుల నియామకం కోసం టీడీపీ అధిష్టానం త్రీమెన్ కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఈ త్రీమెన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను సేకరించాయి. అనంతరం పార్టీ అధిష్టానానికి నివేదికలు సమర్పించాయి. త్రీమెన్ కమిటీల నివేదికలపై ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. ఇటీవలే కొంతమందికి ఫోన్లు కూడా చేసి ఈ విషయాన్ని తెలియజేశారంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ జాబితా కూడా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.
అయితే ఈ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లా అధ్యక్షులను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సామర్థ్యం, అనుభవం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. చంద్రబాబు నాయుడు ఈ జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు.
ఇటీవల వైరల్ అయిన జాబితాలోని మెజారిటీ పేర్లు ఇందులో ఉన్నాయి. అయితే అనంతపురం లోక్‌సభ (జిల్లా) టీడీపీ అధ్యక్షుడి పేరు మాత్రం ఆఖర్లో మారినట్లు సమాచారం. ఇటీవల బయటకు వచ్చిన జాబితాలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అధికారికంగా ప్రకటించిన జాబితాలో మాత్రం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజుకు అవకాశం ఇచ్చారు.
పార్లమెంట్ నియోజకవర్గం వారీగా టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వివరాలు..
అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు -లాలాం కాశి నాయుడు
అరకు (ఎస్టీ) – మోజోరు తేజోవతి – దత్తి లక్ష్మణరావు
శ్రీకాకుళం – మోదవలస రమేష్ – పీరికట్ల విఠల్ రావు
విశాఖపట్నం – చోడే వెంకట పట్టాభిరాం – లొడగల కృష్ణ
విజయనగరం – కిమిడి నాగార్జున – ప్రసాదుల వరప్రసాద్
అమలాపురం – గుత్తల సాయి – పాలం రాజు
ఏలూరు – బడేటి రాధాకృష్ణ – ముత్తారెడ్డి జగ్గవరపు
కాకినాడ – జ్యోతుల నవీన్ – పింకే శ్రీనివాస్ బాబా
నర్సాపురం- మంతెన రామరాజు – పితాని మోహన్ రావు
రాజమండ్రి – బొడ్డు వెంకట రమణ చౌదరి – కాసి నవీన్
బాపట్ల – సలగల రాజశేఖర్ బాబు – నక్కల రాఘవ
గుంటూరు – పిల్లి మాణిక్యరావు – పోతినేని శ్రీనివాసరావు
మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి— గోవు సత్యనారాయణ
నర్సరావుపేట – షేక్ జానే సైదా – నల్లపాటి రామచంద్ర ప్రసాద్
విజయవాడ – గద్దె అనురాధ – చెన్నుబోయిన చిట్టిబాబు
చిత్తూరు – షణ్ముగ రెడ్డి – వై సునీల్ కుమార్ చౌదరి
నెల్లూరు – బీద రవిచంద్ర – చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి
ఒంగోలు – ఉగ్ర నర్సింహా రెడ్డి – కొఠారి నాగేశ్వరరావు
రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు – పఠాన్ ఖాదర్ ఖాన్
తిరుపతి – పనబాక లక్ష్మి – డాలర్ దివాకర్ రెడ్డి
అనంతపురం – పూల నాగరాజు – శ్రీధర్ చౌదరి
హిందూపూర్ – ఎంఎస్ రాజు – హనుమప్ప
కడప – చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి- వైఎస్ జబీవుల్లా
కర్నూలు – గుడిశె కృష్ణమ్మ – పూల నాగరాజు యాదవ్
నంద్యాల – గౌరు చరితా రెడ్డి- ఎన్‌ఎండీ ఫిరోజ్









