జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత శ్లాబుల్ని తగ్గించటం.. పలు వస్తువులు.. వస్తు సేవల మీద భారీగా పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేయటం తెలిసిందే. ఇందులో భాగగా కార్ల మీద ఇప్పటివరకు అమలు చేసిన 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీంతో.. కార్లు కొనుగోలు చేసే వారికి కలిగే ప్రయోజనం భారీగా ఉండనుంది.
అయితే.. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో కార్ల ధరలు భారీగా తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ మోడల్ కు ఎంత? అన్న దానిపై అంచనాలే తప్పించి.. అధికారికంగా ఏ కార్ల కంపెనీ ప్రకటనను విడుదల చేయలేదు. ఈ కొరతను తీరుస్తూ తాజాగా ఫుల్ క్లారిటీతో కూడిన ప్రకటనను టాటా మోటార్స్ వెల్లడించింది. తమ ఉత్పత్తులకు సంబంధించి ఎంత మేర జీఎస్టీ ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుందో పేర్కొంది.
తాము అమ్మే రేంజ్ కార్లకు సంబంధించి జీఎస్టీ పన్ను తగ్గింపునకు సంబంధించిన ప్రయోజనాల్ని పూర్తిగా వినియోగదారుడికి మళ్లిస్తామని టాటా మోటార్స్ స్పష్టం చేస్తోంది.తమ ఉత్పత్తులైన టియాగో మీద రూ.75 వేలు.. టిగోర్ మీద రూ.80 వేలు.. అల్ట్రో మీద రూ.1.10 లక్షలు తగ్గుతాయని చెబుతున్నారు. టాటా కార్లలో మీడియం రేంజ్ విషయానికి వస్తే.. కర్వ్ మీద రూ.65 వేలు.. కాంపాక్ట్ ఎస్ యూవీ పంచ్ మీద రూ.85 వేలు.. నెక్సాన్ మీద రూ.1.55 లక్షలు తగ్గనున్నట్లు టాటా మోటార్స్ చెబుతోంది. ఒక.. ప్రీమియం విభాగానికి వస్తే.. ప్రీమియం ఎస్ యూవీ హారియర్ రూ.1.40 లక్షలు.. సుఫారీ కారు మీద రూ.1.45 లక్షలు తగ్గనున్నట్లుగా టాటా మోటార్స్ వెల్లడించింది. మొత్తంగా తగ్గిన జీఎస్టీ వినియోగదారులకు మళ్లేలా చేయటంలో టాటా పూర్తి స్పష్టత ఇచ్చేసిందని చెప్పాలి.