మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో చేస్తూ, ఒక మోస్తరు రొమాంటిక్ సీన్స్ చేస్తూ వచ్చింది. చాలా సినిమాల్లో ముద్దు సీన్లు అవసరం ఉన్నా కూడా సున్నితంగా నో చెప్పింది. అలాంటి తమన్నా తన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో మాత్రం శృతి మించింది. హద్దులు చెరిపేస్తూ తమన్నా అందులో చేసిన సీన్స్ ఆ సమయంలో చర్చనీయాంశం అయ్యాయి. తమన్నా కెరీర్ చివరి దశకు వచ్చింది కనుక, ఇకపై ఆమె ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోవడం సాధ్యం కాదు కనుక ఇలాంటి పాత్రలు, ఇలాంటి సీన్స్ చేస్తుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అందులోని బోల్డ్ సీన్స్ ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. తమన్నా ఇన్నాళ్ల కెరీర్ లో ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు అంటూ కొందరు ఆమెను విమర్శించారు.
ఇన్నాళ్లుగా ఆమె కాపాడుకుంటూ వచ్చిన ఒక మంచి ఇమేజ్‌ను ఈ ఒక్క వెబ్ సిరీస్‌తో తమన్నా ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమన్నా చేసిన ఆ బోల్డ్ సీన్స్ విషయంలో కొందరి అభిప్రాయం వేరుగా ఉంది. సినిమా లేదా సిరీస్ ఏదైనా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించడం కోసం, తాము చెప్పాలి అనుకున్న కథను సరిగ్గా చెప్పడం కోసం కొన్ని సార్లు బోల్డ్ సీన్స్ ఇతర సీన్స్ ఉంటాయి. కనుక తమన్నా ఆ సీన్స్‌లో నటించడంలో తప్పు లేదని అన్నారు. అయితే ఇన్నాళ్లు ఆ వెబ్ సిరీస్, బోల్డ్ సన్నివేశాలపై స్పందించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చని మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు స్పందించింది. తాను చేసిన పనిని కొందరు విమర్శించినా తాను మాత్రం పట్టించుకోలేదు అంది.
జీ కర్దా వెబ్ సిరీస్ 2023 లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబడింది. ఆ వెబ్ సిరీస్‌కి పెద్దగా హిట్ టాక్ రాలేదు. కానీ తమన్నా యొక్క బోల్డ్ సీన్స్, కొన్ని ఇతర సన్నివేశాల కారణంగా ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. జీ కర్దా లో తాను చేసిన బోల్డ్ సీన్స్ గురించి తమన్నా స్పందించింది. ఆమె తాజా చిట్ చాట్‌లో మాట్లాడుతూ… జీ కర్దా లో వచ్చే ఆ సీన్స్ అన్నీ కూడా కథానుసారంగా వస్తూ ఉంటాయి. కొన్ని సీన్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వస్తే, కొన్ని డాన్స్ చేస్తున్న సమయంలో వస్తాయి. కనుక అవి ప్రత్యేకంగా బోల్డ్ సీన్స్ అనడానికి ఏమీ లేదు అన్నట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది. అంటే కావాలని అవి పెట్టినవి కావు అని, ఆ సీన్స్ యాక్షన్ సన్నివేశాల్లో లేదా పాటల్లో మాత్రమే వచ్చింది అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
తమన్నా ఈ మధ్య కాలంలో ఎక్కవగా సినిమాల్లో కనిపించడం లేదు. హీరోయిన్‌గా కంటే ఐటెం సాంగ్స్ కోసం తమన్నాను ఎక్కువగా సంప్రదించడం విశేషం. ఆమె ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దాంతో ఆమెకు బాలీవుడ్ నుంచి మొదలుకుని టాలీవుడ్ కోలీవుడ్ వరకు అన్ని భాషల్లోనూ ఐటెం సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయి. ఆచితూచి తమన్నా ఐటెం సాంగ్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. హీరోయిన్స్ రేంజ్‌లో తమన్నా ఐటెం సాంగ్స్ కు పారితోషికం తీసుకుంటుంది అనే వార్తలు వస్తున్నాయి. తమన్నా ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. అందుకే ఆమె నుంచి మరిన్ని ఐటెం సాంగ్స్ వస్తాయనే నమ్మకం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వెబ్ సిరీస్‌ల్లోనూ నటించేందుకు తమన్నా రెడీగా ఉంది. హీరోయిన్‌గా తమన్నా సినిమాలు ముందు ముందు మరింతగా తగ్గుతాయేమో అనే చర్చ కూడా నడుస్తోంది.