తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి సంచలన సన్నివేశం చోటుచేసుకుంది. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఉదయం రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
👉 ఆయన తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదుట కూర్చుని, ఆపై రోడ్డుపై పడుకుని ఆందోళన చేశారు.
👉 మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్‌పై ప్రశ్నిస్తూ, “ఆయన డబ్బు చెల్లించారా? చెల్లించి ఉంటే రసీదు చూపించండి” అని డిమాండ్ చేశారు.
👉 అంతేకాదు, తమ పార్టీ అధికారంలో ఉన్నా తమ అనుచరులపై కేసులు పెట్టారని వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసులు ఆయనతో చర్చలు జరిపినా, జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయన అశోక్ పిల్లర్ సర్కిల్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయింపు చేపట్టారు.
“మా డిమాండ్లకు సమాధానం చెప్పాల్సిందే” అంటూ జేసీ భీష్మించుకోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన తాడిపత్రిలో చర్చనీయాంశంగా మారింది.