ఏపీలోని కొందరు వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే సైలెంట్ గా ఉంటుంది ఎవరు ఎలా ఉన్నా తమ సొంత నియోజకవర్గాలలో తమ నివాసాలలోనే ఉంటున్నారు. కానీ ఎక్కడ లేని బాధాలూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికే వచ్చాయని ఆయన అనుచరులు అంటున్నారు. మా నాయకుడికి ఓటమి ఒక్కటే బాధ కాదు అని తాడిపత్రికి గత పదిహేను నెలలుగా దూరం పెట్టడమే అతి పెద్ద బాధగా మారింది అని వాపోతున్నారు.
తాడిపత్రి అంటే గత నాలుగు దశాబ్దాలుగా జేసీ ఫ్యామిలీ చేతులలోనే ఉంది. అనేక దఫాలుగా జేసీ దివాకర్ రెడ్డి, అలాగే ప్రభాకర్ రెడ్డి అక్కడ గెలిచారు. ఇపుడు చూస్తే ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా చేసి 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉండగా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ అయిన వారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన మొత్తం టీడీపీకే ఆనాడు పొలిటికల్ ఐకాన్ గా మారారు. అంతే కాదు తాడిపత్రిలో అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ధీటుగా ఎదుర్కొన్నారు. అలా ఇద్దరు మధ్య పొలిటికల్ వార్ అయితే సాగుతూనే ఉంది
ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటమి పాలు అయ్యాక ఆయనకు తాడిపత్రి వచ్చేందుకు సైతం వీలు లేకుండా పోయింది జేసీ ప్రభాకరరెడ్డి ఆయన వస్తే ససేమిరా ఊరుకోమని అంటున్నారు. దాంతో నో ఎంట్రీ బోర్డు పడిపోయింది. ఇక మొదట్లో తానుగా సొంత బలంతో తాడిపత్రికి వచ్చిన ప్రతీసారీ పోలీసులు ఆయనను తీసుకుని వెళ్ళి ఊరి పొలిమేరలకు దాటించి వచ్చారు. ఇది లాభం లేదని న్యాయ పోరాటం కూడా పెద్దిరెడ్డి చేశారు.
తనను తన సొంత నియోజకవర్గం వెళ్లనీయడం లేదని చెబుతూ హైకోర్టులో పెద్దిరెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే సింగిల్ బెంచ్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే డివిజన్ బెంచ్ మాత్రం స్టే విధించింది. దాని మీద పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా పెద్దిరెడ్డి ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ స్టే వెకేట్ చేయించుకున్నారు. దాంతో ఆయన మరోసారి తాడిపత్రి వైపు చూస్తున్నారు.
ఇక పెద్దిరెడ్డి తాను తాడిపత్రి వెళ్తాను ఈసారి ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని అంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అధికార పార్టీ అండతో తనను అడ్డుకుంటున్నారు అని ఆయన విమర్శిస్తున్నారు. అయితే పెద్దిరెడ్డిని తాము అడ్డుకోవడం లేదని ఆయన అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు బాధితులుగా ఉన్న వారే ఆయనను అడ్డుకుంటారని జేసీ ప్రభాకర రెడ్డి అంటున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో ఎలాగైనా అడుగు పెడతాను అని పెద్దారెడ్డి అంటూంటే వస్తే వెనక్కే అంటున్నారు జేసీ. ఈ మధ్యలో తమకు అసలు సిసలు పరీక్షగా ఇందంతా ఉందని తాడిపత్రి పోలీసులు యమ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ తాడిపత్రికి పెద్దారెడ్డి రాగలరా లేక గతంలో మాదిరిగానే వెనక్కి వెళ్తారా ఏమో రెండు మూడు రోజులోలలో ఆ ముచ్చటా తెలిసిపోతుంది అని అంటున్నారు.