బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ మలైకా అరోరా. ఈమె హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే, అయితే పలు సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ చేసింది. ఆ ఐటెం సాంగ్స్ వల్ల మలైకా అరోరా బాలీవుడ్‌తో పాటు మొత్తం ఇండియా మొత్తం స్టార్‌గా నిలిచింది. మలైకా అరోరా ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ వల్ల ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్స్ మూడు పదుల వయసు వరకు పర్వాలేదు అన్నట్లుగా ఉంటారు. నాలుగు పదుల వయసుకు వచ్చేప్పటికి చాలా మంది హీరోయిన్స్ అందం తగ్గి పోతూ ఉంటుంది. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం అయిదు పదుల వయసులోనూ మూడు పదుల వయసు ఫిజిక్, అందంను మెయింటెన్ చేయగలరు. అందులో మలైకా అరోరా ఒకరు అనడంలో సందేహం లేదు.
మలైకా అరోరా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాతిక ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే. అయినా కూడా ఈమెకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సాలిడ్ స్టార్‌డం కొనసాగుతూనే ఉంది. ఇటీవల మలైకా 51 ఏళ్ల వయసులో అడుగు పెట్టింది. అయినా కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ చాలా మంది మూడు పదుల వయసులోకి అడుగు పెట్టగానే బరువు పెరగడం, ఫేస్ లో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. తినే ఆహారం, వేసుకునే మేకప్ వల్ల కొన్నాళ్ల తర్వాత అందం పోతుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మలైకా అరోరా మాత్రం నేచురల్ బ్యూటీ అనేందుకు ఈ ఫోటోలు సాక్ష్యం.
తాజాగా మలైకా అరోరా ఈ అందమైన ఫోటోలను షేర్ చేసింది. సాధారనంగానే మలైకా షేర్ చేసే ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఔట్ ఫిట్‌ను ధరించడం ద్వారా ఈ ఫోటోలకు డబుల్ రీచ్ దక్కింది అనడంలో సందేహం లేదు. ఈ వైట్ డ్రెస్‌లో మలైకా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ కారణంగా మలైకా ఏకంగా పాతికేళ్ల వయసు తగ్గి మూడు పదుల వయసు కంటే తక్కువ వయసు అమ్మాయి అన్నట్లుగా కనిపిస్తుంది అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు, అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
స్లీవ్‌లెస్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టి క్లీ వేజ్ షో చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోతకు ఎంతటి వారు అయినా ఫిదా కావాల్సిందే. ఈ ఫోటోలను చూస్తే మూడు పదుల వయసు ఉన్న హీరోలు సైతం ఈమెతో కలిసి రొమాన్స్ చేయాలని కోరుకోవడం కామన్. ఇంత అందంగా ఉన్న మలైకా అరోరా ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటుంది అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
మలైకా సినిమాలకు దూరం అయినప్పటికీ బుల్లి తెర ద్వారా, ఇలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సందడి చేస్తూ ఉంది. గత ఏడాది ఒక ప్రత్యేక పాటలో కనిపించిన మలైకా అరోరా మళ్లీ బిజీ కావాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈమె వ్యక్తిగత విషయమై ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. భర్త నుంచి విడి పోయిన తర్వాత యంగ్ హీరోతో లవ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ లవ్ బ్రేకప్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.