ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Raashi Khanna: ఎదురుచూపులకు తెర.!

Raashi Khanna: ఎదురుచూపులకు తెర.!
ADVERTISEMENT

ఊహలు గుసగుసలాడే సినిమాతో 2014లో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టైర్ 2 హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. నాగ చైతన్య, గోపీచంద్‌, సందీప్ కిషన్‌, వరుణ్‌ తేజ్‌ ఇలా పలువురు మీడియం రేంజ్‌ హీరోలతో పాటు సీనియర్‌ హీరో రవితేజ వంటి స్టార్‌తోనూ సినిమాలు చేసింది. కానీ యంగ్‌ స్టార్స్‌ సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్‌ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్రలో నటించినా అది పెద్దగా రాశి ఖన్నా కెరీర్‌కి హైప్‌ తీసుకు రాలేక పోయింది. కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు, సన్నగా, నాజూకుగా కనిపించేందుకు చాలానే కష్టపడుతుంది. సన్నగా మారిన తర్వాత టాలీవుడ్‌లో ఈమెకు మంచి ఆఫర్లు దక్కాయి.

టాలీవుడ్‌లో కాస్త గ్యాప్‌ తర్వాత రాశి ఖన్నా రీ ఎంట్రీకి సిద్ధం అయింది. తెలుగులో ఈమె చివరగా నాగ చైతన్య కి జోడీగా థాంక్యూ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అక్కడ కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఆఫర్లు వచ్చాయి. దాంతో రాశి ఖన్నా కెరీర్‌ ఖతం అనుకున్నారు. కానీ లక్కీగా టాలీవుడ్‌లో బిగ్‌ రీ ఎంట్రీ దక్కింది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశంను దక్కించుకుంది. మరో వైపు బాలీవుడ్‌లో యంగ్‌ స్టార్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కి జోడీగా నటించే అవకాశంను దక్కించుకుంది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుండగా రాశి ఖన్నా సెకండ్‌ లీడ్‌గా కనిపించబోతుంది. మరో వైపు రాశి ఖన్నా హిందీలో ‘నాగ్‌ జిల్ల’ అనే సినిమాలో నటించేందుకు ఎంపిక అయింది. కార్తీక్‌ ఆర్యన్‌ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశి ఖన్నా జాయిన్‌ కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన నాగ్‌ జిల్ల యొక్క టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మృగ్దీప్ లాంబా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సరిగ్గా ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాను 2026 ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

నాగ్‌జిల్ల సినిమాపై రాశి ఖన్నా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. హిందీలో ఈ సినిమా హిట్‌ అయితే తప్పకుండా ఈ అమ్మడికి స్టార్‌డం దక్కబోతుంది. అంతే కాకుండా హిందీలో రాబోయే మూడు నాలుగు ఏళ్ల పాటు బిజీ బిజీగా ఉండే విధంగా చేతికి ఆఫర్లు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే సెకండ్‌ హీరోయిన్‌ అయినప్పటికీ ఖచ్చితంగా మంచి ఆఫర్లు దక్కవచ్చు. అదే జరిగితే టాలీవుడ్‌లోనూ ఈమెకు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కెరీర్‌ ఆరంభం నుంచి అంటే 10 ఏళ్లుగా రాశి ఖన్నా స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కనుక ఈ రెండు సినిమాలతో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. కనుక రాశి ఖన్నాకు 2026 సంవత్సరం అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. మరి రాశి ఖన్నా కోరుకున్నది జరిగేనా అనేది చూడాలి.

Tags: #BollywoodDebut#HarishShankar#KartikAaryan#NagZilla#pawankalyan#RaashiKhanna#RaashiKhannaMovies#RaashiKhannaUpcomingMovies#SecondHeroine#UstaadBhagatSinghEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rajinikanth: ఆ దారిలోనే!

Next Post

Malaika Arora: 50 ఏళ్లు దాటినా పాతికేళ్ల అమ్మాయిలా..!

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Chennai Love Story Review
Entertainment

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Next Post
Malaika Arora: 50 ఏళ్లు దాటినా పాతికేళ్ల అమ్మాయిలా..!

Malaika Arora: 50 ఏళ్లు దాటినా పాతికేళ్ల అమ్మాయిలా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info