ధమాకా బ్యూటీ శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్ లో ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల సినిమాలు మొదలో సక్సెస్ అందుకున్నాయి కానీ రాను రాను ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. తన డాన్స్ ఎనర్జీతో మెప్పిస్తున్నా కూడా ఎందుకో శ్రీలీల సినిమాలు సూపర్ హిట్ అవ్వట్లేదు. శ్రీలీల రీసెంట్ గా జూనియర్ సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో కిరీటికి జతగా నటించింది శ్రీలీల.
వైరల్ వయ్యారి సాంగ్ తో జూనియర్ సినిమా చూసేందుకు బజ్ తెచ్చినా కూడా సినిమా మాత్రం మొదటి షో నుంచే రొటీన్ సినిమా అనే టాక్ తెచ్చుకుంది. ఐతే ఈ సినిమాలో శ్రీలీల రోల్ కేవలం డాన్స్ ల వరకే అనేలా ఉంది. శ్రీలీల సినిమాలో ఉంటే సాంగ్స్ సూపర్ హిట్.. డాన్స్ లు దద్దరిల్లిపోతాయి. కానీ సినిమాల్లో మాత్రం అంత స్టఫ్ ఉండట్లేదు.
గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల పెద్దగా సినిమా ఆఫర్లు అందుకోలేదు. వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ ని రిస్క్ లో పడేస్తున్నాయి. కేవలం డాన్స్ లు, సినిమాకు ఉపయోగపడని సీన్స్ ఉన్నంత మాత్రాన హీరోయిన్ కి క్రేజ్ వస్తుందని చెప్పడం కష్టం. మరి శ్రీలీల ఎందుకు స్టోరీ సెలక్షన్ లో అంత తొందరపడుతుందని అనుకుంటున్నారు. కేవలం రెమ్యునరేషన్ ల కోసమే అయితే ఇలానే కెరీర్ మూడు నాళ్ల ముచ్చట అవుతుంది. అలా కాకుండా కాస్త కథాబలం ఉన్న సినిమాలు, పాత్రలు చేస్తేనే శ్రీలీల కొన్నాళ్లు సినిమాలు చేయగలుగుతుంది. జూనియర్ శ్రీలీల ఫాలోవర్స్ ని కూడా డిజప్పాయింట్ చేసింది. ఇక అమ్మడు ప్రస్తుతం మాస్ మహారాజ్ తో మాస్ జాతర సినిమా చేస్తుంది. ఆ సినిమాతో అయినా హిట్ కొడుతుందేమో చూడాలి. ఇదే కాదు శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అది ఎలాగు పవర్ స్టార్ సినిమా కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీలీలను మళ్లీ సరైన ట్రాక్ లో పెట్టే బాధ్యత రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్నాయి. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ శ్రీలీల తెలుగులో దూకుడు పెంచే అవకాశం ఉంటుంది.