అందానికి నిలువెత్తు రూపంలా కనిపించే శ్రీలీలని మామూలుగా చూస్తేనే చూపు తిప్పుకోలేము. అలాంటిది ఆమెని బ్రైడల్ గెటప్ లో చూస్తే ఇంకేమైనా ఉందా.. ప్రస్తుతం ఇదే చేస్తోంది ఈ చిన్నది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల.. గ్లామర్ ప్రదర్శనతో కుర్రకారుకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె తాజాగా బ్రైడల్ లుక్ లో కనిపించి యూత్ ని మరింత అట్రాక్ట్ చేసింది.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతిరోజు స్టైలిష్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అటు దర్శక నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని సినిమాలలో అవకాశం కల్పిస్తున్నారు అని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు కూడా.. అలా సమయం దొరికితే చాలు ట్రెండీ డ్రెస్సులు వేసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తూ.. హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.
ఇకపోతే నిత్యం గ్లామర్ ఫోటోలతోనే కాదు అప్పుడప్పుడు సాంప్రదాయమైన దుస్తులలో కూడా ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల మాత్రం ఏకంగా బ్రైడల్ గెటప్ లో దర్శనమిచ్చి కుర్రాళ్ల మనసు దోచేసింది.. తాజాగా శ్రీలీల గోల్డ్ కలర్ శారీలో.. ఊదా రంగు సీక్వెన్స్ బ్లౌజ్ ధరించి అచ్చం నవ వధువు ఎలా ఉంటుందో అలా రెడీ అయింది. మెడలో నెక్లెస్, చెవులకు బుట్టాలు, చెంపస్వరాలు ఇలా అన్ని ఆభరణాలను అలంకరించుకొని పొడవైన జుట్టుతో సేమ్ పెళ్లికూతురు గెటప్ ను తలపించేలా రెడీ అయింది.. ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన బ్రైడల్ లుక్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఆమె లుక్ పై కామెంట్లు పెడుతున్నారు.
కొంతమందేమో పెళ్లికి రెడీ అయిన శ్రీలీల అంటే.. మరి కొంతమందేమో కొత్తపెళ్లి కూతురిలా మెరిసిపోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది మ్యాటర్ ఏంటి బేబీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా బ్రైడల్ లుక్ లో ఉన్న శ్రీలీల ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
శ్రీలీల సినిమాల విషయానికి వస్తే..బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ మూవీ చేస్తోంది.. అంతేకాదు మాస్ మహారాజా రవితేజ హీరోగా.. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలో కూడా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.
ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఇటీవల నిర్మించిన కింగ్డమ్, డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ 2 పెద్దగా కలెక్షన్లు అందించలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ చేస్తే విజయం సాధిస్తే ఓకే.. లేకపోతే నష్టం చవిచూడక తప్పదు. అందుకే కాస్త టైం చూసుకుని ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ అఖండ 2 తాండవం చిత్రాలు రాబోతున్నాయి. కాబట్టి అక్టోబర్లో వచ్చే ఇడ్లీ కడై, కాంతారా చాప్టర్ వన్ చిత్రాల మధ్యలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Draped in elegance, glowing in grace@sreeleela14
✨📷 #SreeLeela #MassJathara pic.twitter.com/6qi2j3Pn8j— news7telugu (@news7telug2024) August 19, 2025