ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వాటిలో నిన్న ఒక్కరోజే సుమారుగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ సైతం ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఒకటి స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చిత్రం.
తెలుగులో అన్ని రకాల జోనర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో బయోగ్రాఫికల్‌గా వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలా రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన సినిమానే అర్జున్ చక్రవర్తి. నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవిత కథ ఆధారంగా అర్జున్ చక్రవర్తి సినిమాను రూపొందించినట్లు ప్రమోషన్స్‌లలో మేకర్స్ తెలిపారు.
తెలుగు బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి సినిమాలో హీరోగా విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించాడు. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. శ్రీని గుబ్బల అర్జున్ చక్రవర్తి సినిమాను నిర్మించారు. అర్జున్ చక్రవర్తి సినిమా థియేటర్లలో ఆగస్ట్ 29న రిలీజ్ అయింది.
అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అర్జున్ చక్రవర్తి సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేడుకల్లో ప్రదర్శించబడి సుమారుగా 46 అవార్డ్స్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అలాంటి సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. కబడ్డీ ఆట, విజయం, లవ్ ట్రాక్, ఛాలెంజ్ వంటి అంశాలతో అర్జున్ చక్రవర్తి సినిమాను మలిచారు.
అర్జున్ చక్రవర్తి సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.2 రేటింగ్ ఉంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు అర్జున్ చక్రవర్తి ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 25 నుంచి అర్జున్ చక్రవర్తి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలోనే అర్జున్ చక్రవర్తి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అయితే, తాజాగా మరో ఓటీటీలోకి అర్జున్ చక్రవర్తి సినిమా ఎంట్రీ ఇచ్చింది. లయన్స్ గేట్ ప్లేలో నిన్న (నవంబర్ 7) అర్జున్ చక్రవర్తి ఓటీటీ రిలీజ్ అయింది. అంటే మరో ఓటీటీలో నిన్నటి నుంచి అర్జున్ చక్రవర్తి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తానికి రెండు, మూడు నెలల గ్యాప్‌తో 2 ఓటీటీల్లో అర్జున్ చక్రవర్తి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే, అర్జున్ చక్రవర్తి సినిమాలో విజయ రామరాజు హీరోగా చేస్తే సిజా రోజ్ హీరోయిన్‌గా చేసింది. దయానంద్ రెడ్డి, హర్ష్ రోషన్, అజయ్ ఘోష్, అజయ్, దుర్గేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అర్జున్ చక్రవర్తి సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.















