పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్(Spirit) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ ఇచ్చారు.
అయితే సినిమాలో ప్రభాస్ (Prabhas)పోలీస్ రోల్ లో కనిపించనున్నారు. కెరీర్ లోనే తొలిసారి ఖాకీ డ్రెస్ లో సందడి చేయనున్నారు. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తీ డిమ్రీ (Tripti Dimri)నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తారని తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం ఓ కార్యక్రమానికి వచ్చిన రణబీర్.. తనకు స్పిరిట్ మూవీలో నటించాలని ఉందని తెలిపారు. గెస్ట్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. దీంతో వారిద్దరినీ ఒకే స్క్రీన్ పై వంగా చూపిస్తే బాగుణ్ణు అని కొందరు మూవీ లవర్స్ అనుకున్నారు. ఇప్పుడు అది నిజమవ్వనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సినిమాలో కీలకమైన సీన్ ద్వారా రణబీర్ కపూర్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ ఒక్కరే సినిమాకు చాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు హైప్ కోసమే రణబీర్ కపూర్ (Ranbir Kapoor )ను తీసుకొస్తున్నారని అంటుండగా.. ఇంకొందరు ఇది సందీప్ వంగా బాలీవుడ్ ప్లాన్ అని అంటున్నారు. బీ టౌన్ లో హైప్ క్రియేట్ చేయడమే సందీప్ వంగా ప్లాన్ అని చెబుతున్నారు. నిజానికి.. ప్రభాస్ కు కూడా నార్త్ లో సూపర్ క్రేజ్ ఉంది. వివిధ సినిమాలతో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది.
దీంతో స్పిరిట్ పై నేచురల్ గానే హైప్ ఏర్పడుతుంది. కానీ రణబీర్ ఉంటే దాన్ని ఇంకా పెంచవచ్చని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు ఉందని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే రణబీర్ ను స్పిరిట్ ప్రాజెక్టులోకి తీసుకున్నారో లేదో అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
















