సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులలో నిందితులకు రిమాండ్ విధించేప్పుడు తాము ఇచ్చిన సర్క్యులర్‌లోని అంశాలను తూ.చ. తప్పకుండా పాటించాలని పేర్కొంటూ గత నెల 5న హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. అయితే.. ఆ సర్క్యులర్‌లో పేర్కొన్న అంశాల్లో లోపా లు ఉన్నాయని కొందరు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సదరు సర్క్యులర్‌లోని లోపాలను సరిచేస్తూ రిజిస్ట్రార్ జ్యుడీషియల్ కమలాకర్‌రెడ్డి సవరణ సర్క్యులర్‌ను విడుదల చేశారు.
మార్పులు ఇవీ..
1) సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర ఒక పోస్టు, వ్యాఖ్య పెట్టినందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, నిందితులకు రిమాండ్ విధించే సమయంలో మేజిస్ట్రేట్లు అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని గత సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం.. భారతీయ న్యాయ సంహిత-2023 ప్రకారం ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసులలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించాలని తెలిపారు.
2) ఇమ్రాన్ ప్రతాప్ గాధి వర్సెస్ స్టేట్ ఆప్ గుజరాత్ కేసు మేరకు.. ప్రసంగం, రచన, కళాత్మక వ్యక్తీకరణకు సంబంధించి అందిన ఫిర్యాదులలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముం దు బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 173(3) కింద పోలీసులు ప్రాధమిక విచారణ జరపాలి. డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. 14 రోజుల్లో ప్రాధమిక విచారణ ముగించాలని గత సర్క్యులర్‌లో పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు 3 నుంచి ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న ేరాలకు సంబంధించిన కేసులలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 173(3)ని అనుసరించారా? అనేది మేజిస్ట్రేట్లు నిర్ధారించుకోవాలని సూచించారు.
3) మేజిస్ట్రేట్‌లు రిమాండ్ విధించేటప్పుడు దర్యాప్తు అధికారి అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాధి కేసులలో సుప్రీం తీర్పులను అనుసరించారా?. నిందితుడు నేరాలను పునరావృతం చేశాడా?. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా?. ఆధారాలను తారుమారు చేయగలరా?. కస్టోడియల్ విచారణ అవసరమా?. తదితర అంశాలపై సంతృప్తి చెందిన తరువాతే రిమాండ్ పై నిర్ణయం తీసుకోవాలని పాత సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అయితే, తాజా సర్కులర్‌లో.. ఏడేళ్ల వరకు శిక్షకు వీలున్న కేసులలో రిమాండ్ విధించే ముందు దర్యాప్తు అధికారి అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాధి కేసులలో సుప్రీం తీర్పులను అనుసరించారా?. లేదా?. అనే విషయంపై మేజిస్ట్రేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
4) గత సర్క్యులర్‌లో పేర్కొన్న సూచనలను మేజిస్ట్రేట్‌లు తూ.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని, శాఖాపరమైన విచారణను ఎదుర్కోవడమే కాకుండా కోర్టుధిక్కరణ కింద చర్యలకు బాధ్యులవుతారని తెలిపారు. తాజాగా సర్క్యులర్‌లో పేర్కొన్న సూచనలను తప్పకుండా పాటించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణకు బాధ్యులవుతారని పేర్కొన్నారు.