విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారే సంఘటలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. సాటి మనిషిని నమ్మే పరిస్థితుల్ని పక్కన పెడితే.. అయినోళ్లను సైతం అనుమానంగా చూసే పాడు రోజులు దాపురించాయి. అన్నింటికి మించి కట్టుకున్న భర్తను.. కన్నబిడ్డల్ని సైతం తాత్కాలిక ఆనందాల కోసం.. అదనపు సుఖాల కోసం అడ్డు తొలిగించుకుంటున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. తాజాగా అలాంటి మరో ఉదంతం వెలుగు చూసింది.
చేసుకుంది. హైదరాబాద్ లోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఒక వివాహితకు హాలియా మండల కేంద్రానికి చెందిన నరేశ్ తో ఇన్ స్టాలో పరిచయమైంది. అది కాస్తా.. అంతకు మించి ముందుకు వెళ్లింది. నల్గొండలో ఉంటున్న అతడ్ని కలిసేందుకు వచ్చిన ఆమె.. తన పద్దెనిమిది నెలల కొడుకును బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది. Also Read – షాకింగ్ ఇష్యూ… గబ్బిలాలతో స్పెషల్ చికెన్ ఐటమ్స్! హైదరాబాద్ నుంచి నల్గొండ బస్టాండ్ కు చేరుకున్న ఆమె.. కాసేపు అక్కడే ఉండి.. టూవీలర్ మీద వచ్చిన తన ప్రియుడితో కలిసి వెళ్లేందుకు.. చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అప్పటివరకు కన్నతల్లి సంరక్షణలో ఉన్న ఆ చిన్నారి.. తల్లి కనిపించకపోవటంతో గుక్కపట్టి ఏడవటం మొదలు పెట్టారు. దీంతో.. అక్కడున్న వారు చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన వారు బస్టాండ్ లో ఉన్న సీసీ కెమేరాల్ని తనిఖీ చేయగా.. బిడ్డను బస్టాండ్ లో వదిలేసిన వైనాన్ని గుర్తించారు. టూవీలర్ ను ట్రేస్ చేసిన పోలీసులు.. దాని రిజిస్ట్రేషన్ ఆధారంగా నరేశ్ ను గుర్తించి.. అతడ్ని.. అతడితో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని భర్తకు సమాచారం అందించి.. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి.. బాలుడ్ని అప్పజెప్పారు. సమాచారం అందుకున్నంతనే స్పందించిన పోలీసు సిబ్బంది తీరు పలువురు అభినందిస్తున్నారు.