ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌

SLBC Tunnel : రోబోతో రెస్క్యూ ఆపరేషన్‌
ADVERTISEMENT

దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) మరో ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. అక్కడ రెస్క్యూ బృందాల ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో అన్వి రోబోను రంగంలోకి దించారు.

మంగళవారం ఉదయం షిఫ్టులో 110 మంది సహాయక బృందాలతో పాటు అన్వి రోబో బృందంతో లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. అన్వి రోబోను ప్రత్యేక వాహనంలో రోబో బృందం మంగళవారం ఉదయం టన్నెల్ వద్దకు చేరుకున్నది. రోబోతో పాటు దానిని ఆపరేట్ చేసే బృందం లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. మార్నింగ్ షిఫ్టులో లోపలికి వెళ్లిన సహాయక బృందం మధ్యాహ్నం 2-3 గంటలకు బయటకు రానున్నారు.

సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంతో పాటు పక్కన రెండు రోజులపాటు తవ్వకాలు జరిపారు. కేరళ డాగ్స్, జిపిఆర్ సిస్టం ద్వారా గుర్తించిన D1,D2 ప్రదేశాలలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు చేపట్టినా మిగిలిన ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. దీంతో లోపల చివరి పాయింట్ వద్ద రెస్క్యూ బృందాలు వెళ్లడానికి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో అక్కడేమైన మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో తో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా లోపలికి వెళ్లారు. 13.200 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా చేరుకుంటారు. అక్కడనుండి 13.850 కిలోమీటర్ల వరకు కాలినడకన శిథిలాలు, మట్టి, బురద, రెండు ఎస్కవేటర్ల మట్టి, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది.

టన్నెల్‌లో దాదాపు 150 మీటర్ల విస్తీర్ణంలో 16 ఫీట్ల ఎత్తులో మట్టి, బురద, శిథిలాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని తొలగించడానికి చాలా రోజుల సమయం పట్టనుంది. అయితే కేరళ క్యాడర్ డాగ్స్ సూచించిన ప్రదేశాలలో తవ్వకాలను జరుపుతున్నారు.

17 రోజులపాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు కార్మికుల జాడ లభించకపోవడంతో రోబో ద్వారా అయినా ఆచూకీ లభిస్తుందనే ఆశతో రంగంలోకి దింపారు. మానవులు చేరుకోలేని ప్రదేశానికి రోబోను పంపి సహాయక చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. టీబీఎం మిషన్ భాగాలు టన్నెల్ నిండా ఉన్నాయి. దీంతో సహాయక బృందాలు మరింత ముందుకు వెళ్లడానికి టీబీఎం మిషన్ భాగాలను కట్ చేసి కుడి వైపు నుంచి లోపలికి వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు. లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోశ్‌లు ఎప్పటికప్పుడు రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ చర్యలు చేపడుతున్నారు. 14 బృందాలతో పాటు సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. లోపలికి వెళ్లిన సిబ్బంది తమ వెంట వాటర్ బాటిల్, బిస్కెట్లు, టిఫిన్, సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రితో వెళ్లారు.

Tags: #DisasterResponse#EmergencyRescue#RescueOperation#RobotRescue#SaveLives#SLBCTunnelRescue
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

డంకీ రూట్‌ ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!

Next Post

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

Related Posts

PriyankaMohan
Entertainment

PriyankaMohan:గ్యాంగ్ లీడర్ నుంచి OG వరకు.. ప్రియాంక ఫ్యాషన్ జర్నీ వైరల్

Telangana
Big Story

Telangana:వరంగల్-ఖమ్మం-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు కీలకం: సీఎం రేవంత్

NEET2026
Big Story

NEET2026:పరీక్ష పేపర్లు పదే పదే లీక్ అవుతున్నా బాధ్యత ఎవరిది?

MedakBankScam
Crime

MedakBankScam:ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. బ్యాంక్ మేనేజర్‌ను నేరస్తుడిగా మార్చిన తీరు

CIISummit2026
Big Story

CIISummit2026:దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడుల వరద.. చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌పై ప్రశంసలు

Telangana
Big Story

Telangana:ప్రభుత్వ బడులు ప్రైవేటుకు ధీటుగా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు

Next Post
Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PriyankaMohan

PriyankaMohan:గ్యాంగ్ లీడర్ నుంచి OG వరకు.. ప్రియాంక ఫ్యాషన్ జర్నీ వైరల్

Telangana

Telangana:వరంగల్-ఖమ్మం-కరీంనగర్ కారిడార్ తెలంగాణకు కీలకం: సీఎం రేవంత్

NEET2026

NEET2026:పరీక్ష పేపర్లు పదే పదే లీక్ అవుతున్నా బాధ్యత ఎవరిది?

MedakBankScam

MedakBankScam:ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. బ్యాంక్ మేనేజర్‌ను నేరస్తుడిగా మార్చిన తీరు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info