ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Sita Rama Kalyanam:సీతారాముల కళ్యాణం..ప్రత్యేకతలు తెలుసా..?

Sita Rama Kalyanam:సీతారాముల కళ్యాణం..ప్రత్యేకతలు తెలుసా..?
ADVERTISEMENT

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదీ ఓ అద్భుతమే. రామ భక్తుడు రామదాసు నిర్మించిన ఆలయంగా భద్రాచలం చరిత్రకెక్కింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే సీతారామస్వామి కళ్యాణ వేడుకను చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. భద్రాచల ఆలయానికి అనుంబంధంగా కొనసాగుతున్న మిథిలా స్టేడియంలోని ‘మిథిలా మండపం’లో రామయ్య కల్యాణం జరగనుంది. ఉదయం 10.30-12.30 గంటల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. సీఎం రేవంత్‌ రెడ్డి సతీసమేతంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

అయితే ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కళ్యాణ వేడుకను మిథిలా కల్యాణమండపంలోనే నిర్వహిస్తారు. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ మండపం.. ఈ శతాబ్దంలోనే నిర్మించబడిన అద్భుత కట్టడాలలో ఒకటిగా నిలిచింది. ఏక శిలపై రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై అద్భుతంగా కళ్లకు కట్టినట్లుగా చెక్కారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ‘మిథిలా’ మండపాన్ని నిర్మించారు. ప్రత్యేకించి చూస్తే ఈ కళ్యాణమండపం చెక్కిన తీరు నిజంగా ఓ అద్బుతమనే చెప్పాలి.

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కొత్తగా కట్టడాలను నిర్మించాలని.. మరికొన్ని పురాతన కట్టడాలను మరమ్మత్తులు చేయాలని ఆరు దశాబ్దాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1958లో ‘భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయ పునరుద్ధరణ సంఘం’ పేరుతో ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు 20 వేల మంది భక్తులు.. ఒకే చోట కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయం సమీపంలోనే ఐదు ఎకరాల స్థలంలో ‘మిథిలా స్టేడియాన్ని’ నిర్మించ తలపెట్టారు. 1960 మే 30 న ఈ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1964 జూన్ 4న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మిథిలా స్టేడియాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణానికి మిథిలా మండపం వేదికగా నిలుస్తుంది. అదే ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.

పురాణాల ప్రకారం ‘మిథిలా’ అనే పేరు రామాయణంలో సీతాదేవి జన్మస్థలమైన మిథిలా నగరాన్ని సూచిస్తుంది. ఈ మండపం సీతారాముల వివాహానికి సంబంధించిన పురాణ గాథలను ప్రతిబింబిస్తూ.. భక్తులకు ఆ దివ్య సంఘటనను గుర్తు చేస్తుంది.

మిథిలా మండపం సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దీని స్తంభాలు, శిల్పాలు రామాయణ ఘట్టాలను వర్ణిస్తూ ఉంటాయి, ఇది దర్శనీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

భద్రాచలం ఆలయ చరిత్రలో భక్తుడైన భద్రుడు కీలక పాత్ర పోషించాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. మిథిలా మండపం ఈ భక్తి పరంపరను కూడా సూచిస్తుంది.

శ్రీరామనవమితో పాటు ఇతర ప్రధాన ఉత్సవాల సమయంలోనూ ఈ మండపం వివిధ ఆచారాలకు, సేవలకు వేదికగా ఉపయోగపడుతుంది. ఆలయంలో జరిగే సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిథిలా స్టేడియం కేంద్రంగా నిలుస్తుంది.

మిథిలా మండపం దర్శనం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రత, చారిత్రక నేపథ్యం కారణంగా భద్రాచలం యాత్రలో తప్పక చూడవలసిన ప్రదేశంగా మిథిలా స్డేడియం గుర్తింపు పొందింది.

Tags: #BhaktiMoments#DevotionalEvents#DivineWedding#HinduFestivals#RamNavami#SitaRamaKalyanam#SpiritualIndia#SpiritualVibes#SriRamaNavami#TeluguCulture#TempleTraditions#సీతారాములకళ్యాణం
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Diabetes: డయాబెటిస్‌కు పవర్‌ఫుల్ దివ్యౌషధం..!

Next Post

Pamban Bridge:పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Related Posts

Nakshatra
Entertainment

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row
Big Story

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder
Big Story

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Next Post
Pamban Bridge:పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Pamban Bridge:పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info