ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, కుబేరులు అనగానే చాలా సందర్భాల్లో అంబానీ, ఆదానీతో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తాయి. అయితే వీరు మాత్రమే కాకుండా భారతదేశంలోని మరో బిలియనీర్ భారీ ఎత్తున విరాళాల అందిస్తున్నాడు తెలుసా? రోజకు రూ.6 కోట్ల రూపాయలు దానం చేశాడు.
ఎవరీ బిలియనీర్?
శివ్ నాడార్…HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, విద్యా సంస్కరణవాది మరియు 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ దాదాపు రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చాడు. మీరు విన్నది నిజమే, ప్రతీ రోజు ఏకంగా రూ.6కోట్లు దానం చేశాడు.ఎడెల్‌గైవ్-హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 ప్రకారం, శివ్ నాడార్ మొత్తం దాతృత్వ విరాళాలు రూ. 2,153 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తం డబ్బు, అనేక చిన్న దేశాలు బడ్జెట్‌లో విద్య కోసం ఏటా ఖర్చు చేసే దానికంటే చాలా ఎక్కువ.
భారత మిలియనీర్లలో శివ్ నాడార్ మాత్రమే కాదు, ఎంతో మంది దానాలు చేస్తున్నారు. ఎడెల్‌గైవ్-హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 ప్రకారం, భారతదేశంలో 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో దానాలు చేశారు. రూ.8,783 కోట్ల రూపాయలు దానాలు చేశారు, గత ఏడాదితో పోల్చితే ఇది 4 శాతం ఎక్కువ. 2022 సంవత్సరంలో పోల్చితే ఇది 22 శాతం ఎక్కువ. ఈ విరాళాల్లో సింహభాగం, సుమారుగా రూ.3,680 కోట్లు ఎడ్యుకేషన్‌కే వెళ్లాయి, ఆ తర్వాత రూ.626 కోట్లు ఆరోగ్యానికి వచ్చాయి. 100 కోట్లకుపైగా విరాళ ఇచ్చిన వారి సంఖ్య 2018లో కేవలం 2 ఉంటే, 2024లో 18కి పెరిగింది.శివనాడార్…ప్రస్థానం 1976లో ప్రారంభమైంది. ఐదుగురు టెక్నీషియన్లతో ఒక గ్యారేజీలో HCL టెక్నాలజీస్ స్థాపించడంతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. నేడు ఆ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఏడాదికి సుమారుగా 13.4 బిలియన్లు (భారత కరెన్సీలో రూ.1 లక్ష కోట్లకు పైగా ) ఆదాయాన్ని పొందుతోంది.
1996,చెన్నైలో తన తండ్రి పేరు మీద SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను స్థాపించారు. ఇది కేవలం ఒక సాధారణ వానిటీ ప్రాజెక్ట్ కాదు. భారతదేశాన్ని పునర్నిర్మించడానికి విద్యను మాత్రమే శక్తివంతమైన సాధనంగా నాడార్ భావించారు. 2009లో, ఆయన విద్యాజ్ఞాన్ అనే ఒక ప్రత్యేకమైన పాఠశాల విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు, దీని ద్వారా గ్రామీణ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన పిల్లలకు ఉన్నత స్థాయి, ఉచిత విద్యను అందిస్తుంది. మెట్రో నగరాలు మాత్రమే కాకుండా, భారతదేశంలోని గ్రామాల నుండి నాయకులను తయారుచేయడమే ఆయన లక్ష్యం.ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, విద్యాజ్ఞాన్ స్కూల్స్ స్టేట్ బోర్డు టాపర్లను మరియు ఇంటర్నేషనల్ స్కాలర్స్ కూడా తయారు చేశాయి. టాలెంట్‌కు భౌగోళిక పరిమితులు లేవని , అవకాశం దొరికితే చాలని నిరూపించారు.