సమంత.. ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరి కంటే టాప్ ప్లేస్ లో ఉండేది. అక్కినేని ఫ్యామిలీ వంటి బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్ళినా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పకుండా మరిన్ని సినిమాల్లో చేసింది. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాక సమంత ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఇమేజ్ ను ఎన్నో రోజులు కాపాడుకోలేకపోయింది. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది.
అయితే సమంత విడాకుల విషయం కాస్త పక్కన పెడితే.. ఒకప్పుడు ఏడాదికి మూడు,నాలుగు సినిమాలు చేసే సమంత ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఈ విషయంలో సమంత అభిమానుల్లో నిరాశ అయితే ఉంది.అయితే తాజాగా సమంత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.ఆ కారణం వల్లే నేను సినిమాలు చేయట్లేదు అంటూ చెప్పింది. మరి ఇంతకీ సమంత సినిమాలు తగ్గించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత గత కొద్దిరోజుల నుండి ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే కమిట్ అవుతోంది. దానికి ముఖ్య కారణం ఆమెకి ఉన్న ఆరోగ్య సమస్యలు అనుకోవచ్చు. మయాసైటిస్ బారినపడి శరీరం బక్క చిక్కిపోయి అసలు ఈమె సమంతనేనా అనే స్థితిలోకి మారిపోయింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోల్కొని మళ్లీ తన హెల్త్ ని కాపాడుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమాల గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను నా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫిజికల్ గా, మెంటల్ గా, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సినిమాలు చేయగలం. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదారు సినిమాలు ఓకే చేయలేను. నా శరీర స్పందనను బట్టి సినిమాలను ఓకే చేస్తున్నాను. ముందు నా కంఫర్ట్ చూసుకుంటున్నాను. వర్క్ లోడ్ తగ్గించేసా.. అయితే సినిమాలు తక్కువ చేసినప్పటికీ అందులో క్వాలిటీ మాత్రం తగ్గదు.
అందుకే ఒకేసారి ఐదు సినిమాలు కాకుండా నాకు ఇష్టం ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే సంతకం చేస్తున్నాను. అయితే అంతకు ముందు నేను నటించిన సినిమాలు బాగా లేవని కాదు. కానీ ఇకపై నేను నటించబోయే సినిమాలన్నీ కూడా ఉత్సాహంగా చూసేవారికి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చింది. అలా ఆరోగ్య సమస్యల వల్లే పని భారాన్ని తగ్గించుకుంటున్నానని కూడా స్పష్టం చేసింది.. డబ్బు,పనికంటే ముఖ్యం ఆరోగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.ఇదే సూత్రాన్ని సమంత కూడా ఫాలో అవుతోంది. అందుకే సమంతకి అవకాశాలు వచ్చినా కూడా ఓకే చేయడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. అలాగే రామ్ చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. సమంత చివరిగా తను స్వయంగా నిర్మించిన శుభమ్ మూవీ లో గెస్ట్ రోల్ పోషించింది.