బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో మాధురీ దీక్షిత్ ఒకరు. చిన్నతనం నుంచి నటనపై, నృత్యం పై మక్కువ పెంచుకున్న మాధురి దీక్షిత్.. 1984లో `అబోద్` అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాకపోయినా.. మాధురి అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక నటిగా చేసిన మాధురి దీక్షిత్‌కు.. 1988లో విడుదలైన `తేజాబ్` చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలోని `ఏక్ దో తీన్` సాంగ్ ఆమెను ధక్ ధక్ గర్ల్ గా ప్రసిద్ధి పొందేలా చేసింది.
ఆ తర్వాత మాధురీ దీక్షిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ 80, 90 దశకాల్లో బాలీవుడ్ లో ఆగ్ర తారగా ఆమె ఓ వెలుగు వెలిగింది. అయితే మాధురీ దీక్షిత్ సినిమాలే కాదు, ఆమె నిజ జీవితంలోని ప్రేమకథలు కూడా తరచూ చర్చకు వస్తుంటాయి. కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడు ఆమె పలువురు నటులతో లవ్ ఎఫైర్స్ నడిపినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ప్రముఖంగా సంజయ్ దత్‌తో మాధురీ దీక్షిత్ 90వ దశకంలో డీప్ రిలేషన్ ను కలిగి ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. `సాజన్`, `ఖల్నాయక్` వంటి చిత్రాల్లో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఆ సినిమాల సమయంలో ఇరువురి మధ్య ప్రేమ చిగిరించిందని ప్రచారం జరిగింది. అయితే 1993లో సంజయ్ దత్ టెర్రరిస్ట్ ఆరోపణలతో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత అయనతో మాధురి బంధం ముగిసినట్లు వార్తలు వచ్చాయి.
అలాగే మాధురీ దీక్షిత్ మరియు అనిల్ కపూర్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు సినీ వర్గాల్లో చాలా కాలం ప్రచారం జరిగింది. ఆన్ స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడిగా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్‌లోనూ సంబంధం కలిగి ఉన్నారని అప్పట్లో టాక్ ఉండేది.1980ల చివరి, 1990ల ప్రారంభంలో మిథున్ చక్రవర్తితో మాధురీ దీక్షిత్ లవ్ ఎఫైర్ హైలెట్ అయింది. మిథున్ చక్రవర్తి అప్పటికే పెద్ద స్టార్ కాగా.. మాధురీ అప్పుడప్పుడే స్టార్డమ్ కు చేరువవుతోంది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడం, సన్నిహితంగా మెలగడంతో.. మిథున్ తో మాధరీ ప్రేమలో పడిందంటూ బాలీవుడ్ మ్యాగజీన్లు చాలా కథనాలు ప్రచురించాయి.
వీరే కాకుండా ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, క్రికెటర్ అజయ్ జడేజా వంటి వారితోనూ మాధురీ దీక్షిత్ కు ప్రేమ సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వారెవ్వరినీ మాధురీ దీక్షిత్ వివాహం చేసుకోలేదు. 1999లో ఆమె అమెరికన్ కార్డియోలాజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ మహదేవ్ నెనెను పెళ్లాడింది. పెళ్లి తర్వాత మాధురీ సినీ జీవితానికి బ్రేక్ ఇచ్చి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ అందాల తార టెలివిజన్ షోలలో న్యాయనిర్ణేతగా, వెబ్ సిరీస్‌లలో నటిగా రాణిస్తున్నారు.