స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రస్తుతం సినిమాలేవీ లేకపోయినా, తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటుంది. అయితే కొంతకాలంగా ఆమె దర్శకుడు రాజ్ నిడమోరు తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ ఇద్దరూ అమెరికా వెకేషన్ కు వెళ్లడం, రీసెంట్ గా ఒకే కారులో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
తాజాగా ఆమె చేసిన పని ఇంకోటి ఈ రూమర్లకు ఆజ్యం పోసింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటో ఒకటి మరోసారి రాజ్- సమంత రిలేషన్ షిప్ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఫొటోల్లో రాజ్ నిడమోరు లేరు. కేవలం సమంత మాత్రమే ఉంది. ఏదో కెఫేలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నట్లు ఫొటోల్లో కనిపిస్తుంది. అయితే ఇందులో అభిమానుల దృష్టి బ్రేక్ ఫాస్ట్ పై కాకుండా ఆమె చేతి వేళ్లపే పడింది.
అవును, సమంత లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె చేతి వేలికి ఓ స్పెషల్ రింగ్ ఉంది. డైమండ్స్ పొదిగినట్లు కనిపిస్తున్న ఈ రింగ్ మధ్యలో ఓ స్టోన్ ఉంది. ఆ స్టోన్ ఓవల్ షేప్ లో ఉంది. రెండు వైపులా డైమండ్స్ కూడా ఉన్నాయి. ఈ రింగ్ డిజైన్ చాలా యానిక్ గా ఉంది. ఇది లైటింగ్ కు దగదగ మెరిస్తుంది. అయితే ఇదివరకు ఎప్పుడూ ఆమె చెతి వేలికి ఇలా ప్రత్యేకంగా రింగ్ ధరించలేదు. ఇది అనేక ఊహాగానాలకు దారి తీస్తుంది. కాగా, రాజ్- డీకే కలిసి తెరకెక్కించిన.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్: హనీ బన్నీలో సమంత కీలక పాత్రలో నటించింది. ఆ ప్రాజెక్ట్‌లు తెరకెక్కుతున్న సమయంలో రాజ్ తో సామ్ కు స్నేహం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం సినిమాకు కూడా రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అలా వీరి స్నేహం బలంగా మారి, ప్రేమ వరకు వెళ్లిందని ప్రచారం సాగుతోంది. కానీ, ఈ ఇద్దరిపై వస్తున్న రూమర్స్ కు సామ్ కానీ, రాజ్ కానీ స్పందించలేదు.