ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమెకు.. అభిమానులు ప్రత్యేకంగా గుడిని కట్టి మరీ పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతలా అభిమానులలో ఆదరణ పొందిన సమంత కెరియర్ పీక్స్ లో ఉండగానే తన తొలి తెలుగు సినిమా ‘ ఏ మాయ చేసావే ‘ హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాలలో నటించారు కూడా.అయితే ఏమైందో తెలియదు సడన్ గా 2021 లో అనగా.. పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకుల ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ ఒక కలలా సాగిపోయాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు.. ఇకపోతే విడాకులు తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది సమంత. అదే సమయంలో మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత.. ఈ వ్యాధిని నయం చేయించుకోవడానికి విదేశాలకు కూడా వెళ్ళింది. అంతేకాదు ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.
ప్రస్తుతం నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆరోగ్యం పై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద నంబర్లు చూసి నెంబర్ 1 స్థానం కోసం ఆరాటపడ్డ ఈమె.. సడన్ గా ఆరోగ్యం పై ఫోకస్ పెట్టేసరికి స సమంతా లో ఇంత మార్పా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడుతూ..” నేను నా జీవితంలో ఎన్నో దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. ఆరోగ్య సమస్య రానంతవరకు ప్రతి చిన్న దానికి కూడా మనం ఇబ్బందిగా భావిస్తాము. ఎప్పుడైతే అనారోగ్య బారిన పడతామో దాని ముందు ఏదీ సమస్యగా అనిపించదు. అప్పుడు మన ధ్యాసంతా ఆరోగ్యం పైనే పెడతాము. ప్రస్తుతం నేను నిద్ర, ఆహారం, మానసిక ప్రశాంతతపైనే ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాను. గతంతో పోల్చుకుంటే ఈ విషయంలో మరింత కఠినంగా ఉంటున్నాను. అందుకే ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను.. అన్నిటికీ మూలం ఆరోగ్యమే” అంటూ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏది ఏమైనా మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి కామెంట్లు చేసింది సమంత. మొత్తానికైతే ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ పరిగెత్తాలని చూడకుండా ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని.. ఆరోగ్యం బాగుంటే దేన్నైనా ఈజీగా సాధించవచ్చు అని తన మాటలతో చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.