స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు సామ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులతో వైరల్ గా మారుతున్నారు. రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో నయా పిక్స్ ను షేర్ చేసి ఒక్కసారి అందరి ఫోకస్ తనపై పడేలా చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు
వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన సామ్.. నిన్న బ్రౌన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో మెరిశారు. ఈవెంట్ కోసం చాలా బాగా రెడీ అయిన అమ్మడు.. లోపలకు వెళ్లముందు ఫోటోలకు పోజులిచ్చి సందడి చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అదే సమయంలో తన స్టన్నింగ్ లుక్ కు సంబంధించిన పిక్స్ ను ఇప్పుడు సమంత షేర్ చేశారు. కట్స్ లాంటి డిటైలింగ్ తో ఉన్న డ్రెస్ లో సామ్ వేరే లెవెల్ లో ఉన్నారని చెప్పాలి. ఆమె ఒక్కో స్టిల్ ఓ రేంజ్ లో ఉంది. సింపుల్ మేకర్, లూజ్ హెయిర్, ఎయిర్ రింగ్స్.. ఆమె లుక్ ను మరింత అట్రాక్టివ్ గా చేంజ్ చేశాయి.
ప్రస్తుత సామ్ పిక్స్ తెగ చక్కర్లు కొడుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్లు, మూవీ లవర్స్ రియాక్టవుతున్నారు. ఫైర్ ఎమోజీస్ పెడుతున్నారు. సింప్లీ సూపర్బ్ మేడమ్ అంటూ కొనియాడుతున్నారు. ఎవర్ గ్రీన్ బ్యూటీ.. హీట్ పుట్టించే లుక్స్.. వార్వెవా అంటూ సందడి చేస్తున్నారు. లైక్స్ కొడుతూ తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేస్తున్నారు.
ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. మయోసైటిస్ బారినపడడంతో చిన్న బ్రేక్ తీసుకున్నారు. 2023లో శాకుంతలం, ఖుషీ చిత్రాలతో మెప్పించారు. రీసెంట్ గా నిర్మాతగా మారి శుభం మూవీని రూపొందించారు. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ప్రశంసలు కూడా అందుకున్నారు. సినిమాలో క్యామియో రోల్ లో నటించి అలరించారు. అదే సమయంలో గత ఏడాది సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేశారు. రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్ తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ లో యాక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్నారు. మరి ఎలాంటి హిట్స్ సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.