స్టైలిష్ లుక్స్‌లో ఎప్పుడూ టాప్‌లో ఉండే సమంత తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. రెడ్ శారీ, హెవీ డిజైన్ ఉన్న బ్లౌజ్‌తో యాక్టివ్‌గా స్ట్రీట్‌లో వాక్ చేసిన ఫోటోలు చూసిన నెటిజన్లు, “సామ్ ఇన్ ఫైర్ మోడ్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డెట్రాయిట్ వీధుల్లో ప్రాజెక్టు షూటింగ్ సమయంలో తీసిన ఈ స్టన్నింగ్ లుక్ ఆమె న్యూయేజ్ ఫ్యాషన్‌కు బ్రాండ్ అంబాసడర్ అని మరోసారి రివీల్ చేసింది.
ఈ లుక్‌లో సమంత ధరించిన రెడ్ చీరకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిన బ్లౌజ్ డిజైన్, అలాగే హైరస్టైల్, మేకప్ అన్ని మినిమల్‌గా ఉండటమే కాకుండా క్లాస్‌నెస్‌తో స్టైల్ బ్లెండ్ అయినట్టుగా కనిపించింది. నడకలోని ఆ కాన్ఫిడెన్స్, ఫేస్‌లో ఆ కళ ఆమె అందాన్ని మరో లెవెల్ కు తీసుకు వెళ్లాయి లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ రావడంతో ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్తుంది.
ఇక సమంత కెరీర్‌పరంగా ప్రస్తుతం బిజీగా ఉంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టుతో పాటు ఓ షో హోస్ట్ చేయబోతున్నట్లు టాక్. ఇటీవలే హెల్త్ ఇష్యూస్ నుంచి రికవరీ అయి మళ్లీ ఫిట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సమంత, ఇప్పుడు రెగ్యులర్‌గా వర్కౌట్, పిలేట్స్, స్పిరిచువల్ ట్రావెల్స్‌తో మెంటల్‌గా స్ట్రాంగ్ గా ముందుకు సాగుతోంది. ఆమె లైఫ్ స్టైల్ యూత్‌కు పెద్ద ఇన్‌స్పిరేషన్.
పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటూ, కొత్తగా ఏదైనా ట్రై చేయడంలో ముందుండే సమంత, ఇప్పుడు మళ్లీ తన ఫోటోషూట్‌లు, హెల్త్ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. ప్రత్యేకించి ఈ రెడ్ చీర లుక్ ఆమెను మళ్లీ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. ఫ్యాన్స్ అయితే “ఈ లుక్‌తో మళ్లీ సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేస్తున్న సమంతని చూడాలని ఉంది” అని అంటున్నారు.