ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

KTR: తెలంగాణలో పర్సంటేజీ పాలన కొనసాగుతోంది

KTR: తెలంగాణలో పర్సంటేజీ పాలన కొనసాగుతోంది
ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుప్రస్తావనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు (కేటీఆర్) తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌ను “బ్యాగ్ మ్యాన్”గా అభివర్ణిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తున్న నేతగా అభిప్రాయపడ్డారు.

తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించబడింది. ఆయనపై నేరారోపణలు లేనప్పటికీ, కుట్రకు పాల్పడే వారిలో ఆయన పేరు ఉన్నదని ఈడీ పేర్కొంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్, “తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్కామ్‌గ్రెస్‌గా మారింది. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ATM యంత్రంగా పనిచేస్తున్నారు. ఆయన డబ్బు సేకరణ నైపుణ్యం వల్లే కాంగ్రెస్ నడుస్తోంది,” అంటూ విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసు రేవంత్ పతనానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వస్తే, ఇది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసు. ఈ కేసులో వారు 2010లో మూతపడిన నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను రూ. 50 లక్షల విలువైన యంగ్ ఇండియా కంపెనీ ద్వారా నియంత్రణలోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ చార్జ్‌షీట్ ప్రకారం, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి 2022లో నేషనల్ హెరాల్డ్‌కు రూ. 80 లక్షల విరాళం ఇవ్వాలని పలువురికి సూచించినట్లు చెబుతోంది. ఇదే కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు కూడా ప్రస్తావించబడింది. ఈ కేసు వేగంగా రాజకీయ మలుపులు తిప్పుతుండగా, ఇది తెలంగాణ రాజకీయాల్లో తర్జన భర్జనలకు దారితీయనుంది. రేవంత్ రెడ్డి ఇంకా ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.

ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారింది… దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చేసిన దుష్ప్రచారం తేలిపోయింది… నిన్నటి సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయన్నారు. ఈ కాంగ్రెస్ బిజెపి కలసి కాలేశ్వరం పై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిసాకే… ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జస్టిస్ ఘోష్ విచారణ పూర్తయిందన్నారు. అయితే మళ్లీ ఎందుకు పొడిగించారు? ప్రభుత్వం చెప్పాలన్నారు. కాలేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదని తెలిపారు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని.. కాలేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్ల పిలిచి, 20 నుంచి 30% కమిషన్లు తీసుకోవాలన్నదే అసలు ఏజెండా అని కేటీఆర్ ఆరోపించారు.

సుప్రీంకోర్టుకు కాలేశ్వరం ప్రాధాన్యత, గొప్పతనం అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అర్థమైంది, అందుకే ‘ఇరిగేషన్ మార్వెల్’ అన్నారన్నారు. న్యాయమూర్తులకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న అజ్ఞాని ముఖ్యమంత్రికి అర్థమవడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి పై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయని.. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్‌నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని మన జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘పాలమూరు బిడ్డ’ను చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని ప్రశఅనించారు. పాలమూరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైన కూడా స్పష్టమైన తీర్పులు వస్తాయి. కాలేశ్వరం ప్రాధాన్యతను ప్రజలకు, ఈ మూర్ఖ కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా చెబుతాయమన్నారు.

580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా? అని ప్రశ్నించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, అందరూ దొంగలలాగా చూస్తున్నారంటూ… రెండువందల కోట్ల రూపాయలు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.

మిస్ వరల్డ్ కాంటెస్టులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారు. మంత్రులు సొంగ గాడ్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారని సిపిఐ నారాయణ అన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్… కాలేశ్వరం మీద నోటీసులు – ఇదే రేవంత్ రాజకీయమని విమర్శించారు. మిస్ వరల్డ్ బ్యూటీస్‌కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నది – అంతా మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమేనన్నారు. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా అని ప్రశ్నించారు. కాలేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసిందని ప్రశ్నించారు. మూడు నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారన్నారు. కమిషన్ల కోసం ఎస్ఎల్బీసీ హడావిడిగా మొదలుపెట్టారని.. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, మగోడు అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేవాడన్నారు.

రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు – ఒకరోజు కాలేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటాడు. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్’ అనే మానసిక రుగ్మతతో ఉన్నాడన్నారు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారని.. మరో రోజు కాలేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామంటారన్నారు. వాళ్ల ప్రభుత్వంలోని మంత్రులు రంగనాయక సాగర్ నుంచి నీళ్లకు జెండాలు ఊపుతారు. ఒక రోజు అప్పు లేదు అంటారు… మరొక రోజు అసెంబ్లీలో రూ. 1,70,000 కోట్ల అప్పు చేశామని అంటారు.. ఒక రోజు కాకతీయ కళాతోరణం అధికార చిహ్నంగా వద్దంటారు… మరొక రోజు పొట్టి దారులకు దాన్ని చూపిస్తారు.ఒక రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామని అంటారు… మరొక రోజు కేసీఆర్ కట్టిన ప్రతిదీ తిరిగి చూపిస్తారని విమర్శించారు.

Tags: #BRSvsCongress#CongressScam#EDChargesheet#KTR#NationalHeraldCase#PoliticalDrama#RahulGandhi#revanthreddy#TelanganaNews#TelanganaPolitics
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hari Hara Veera Mallu: పెద్ద ఎత్తున ప్లాన్

Next Post

Sidhika Sharma: కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్..!

Related Posts

Congress
Big Story

Congress:రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక అసలు కథ ఇదేనా?

ZojilaTunnel
Big Story

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,
Entertainment

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #
Big Story

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,
Big Story

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

#HyderabadPolice, #Hyderabad, #CPCVAnand, #PoliceChecking, #OYORooms, #Lodges, #GuestHouses, #HotelInspection, #HyderabadAlert, #CitySecurity, #CrimeControl, #TelanganaPolice, #PoliceDrive, #SecurityCheck, #BreakingNews, #HyderabadNews, #TeluguNews, #LawAndOrder, #PublicSafety, #HotelRules, #SpecialDrive, #CCTVMonitoring, #SafetyFirst, #TrendingNews, #LatestNews, #HyderabadCity, #PoliceAction, #TelanganaNews, #SecurityAlert, #OYORoomsCheck
Big Story

TelanganaPolice:సీపీ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్.. నగర వ్యాప్తంగా హోటళ్లలో సడెన్ చెకింగ్

Next Post
KTR: తెలంగాణలో పర్సంటేజీ పాలన కొనసాగుతోంది

Sidhika Sharma: కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Congress

Congress:రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక అసలు కథ ఇదేనా?

ZojilaTunnel

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info