ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ తన మహానాడుకు కడపలో ఘనంగా నిర్వహించింది. అది ఎంతలా పొలిటికల్ రీసౌండ్ చేసిందో అంతా చూశారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే తెలుగుదేశం పుట్టాక చాలా నగరాలలో మహానాడు నిర్వహించింది. కానీ కడపలో ఇప్పటిదాకా నిర్వహించలేదు. కారణాలు ఏమైనా తెలుగుదేశం పార్టీ తన హిస్టరీలో సాధించనన్ని సీట్లు విభజన ఏపీలో సాధించిన తరువాత కడపను టార్గెట్ చేస్తూ బ్రహ్మాండంగా పార్టీ పండుగను నిర్వహించి వైసీపీకి తన సత్తా ఏంటో చూపించింది.
ఇపుడు కూటమిలో మరో మిత్ర పక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు సిద్ధపడుతోంది. బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. వాటిని కడప నుంచే మొదలుపెడతామని ఆయన ప్రకటించారు. కడపను ఆయన రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తూ అందుకే ఎంచుకుంటున్నామని చెబుతున్నారు. దేవుని తొలిగడప కడప అని మాధవ్ చెప్పారు.అందుకే సారధ్యం పేరుతో రాష్ట్ర పర్యటన త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. తొలి శాసనం దొరికిన జిల్లాగా అలాగే తెలుగు జాతి తెలుగు సంస్కృతికి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన మొదలుపెట్టడం జరుగుతుందన్నారు.
ఐదు విడతలుగా సారద్యం కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుందని మాధవ్ తెలిపారు. ఉత్తరాంధ్ర కు చెందిన మాధవ్ ఇటీవలనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిచారు. హరిబాబు తరువాత మరోసారి ఉత్తరాంధ్రకు ఇటీవల కాలంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం దక్కింది. మాధవ్ ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తన పార్టీ యాక్టివిటీస్ ని మొదలెడతారు అని అంతా అనుకున్నారు. అందుకే ఆయనను ఈ ప్రాంతం నుంచి ఎంపిక చేశారు అని భావించారు. అయితే మాధవ్ తన తొలి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి అందునా జగన్ కి వైసీపీకి హార్డ్ కోర్ జిల్లా అయిన కడప నుంచి ప్రారంభించడం పట్ల ఆసక్తి వ్యక్తం అవుతోంది. రాయలసీమలో పట్టు సాధించాలని టీడీపీ సహా అన్ని పార్టీలు చూస్తున్నాయి. దానికి కారణం 2024లో వైసీపీ రాయలసీమలో పూర్తిగా ఓటమి మూట కట్టుకుంది. ఇక బీజేపీ కూడా అక్కడ గెలిచింది జనసేన కూడా సీట్లు తెచ్చుకుంది.
టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది. దాంతో కూటమి పార్టీలు అన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కార్యక్షేత్రంగా కడపనే ఎంచుకుంటున్నాయి. పవన్ కూడా అనేక సార్లు రాయలసీమలో పర్యటించి వస్తున్నారు. చంద్రబాబు కూడా నెలలో కనీసం రెండు సార్లకు తక్కువ కాకుండా సీమ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఇపుడు బీజేపీ సైతం రాయలసీమ వైపే ఫోకస్ పెడుతోంది. దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది. వైసీపీ తన పట్టుని నిరూపించుకోవాలని ఒక వైపు చూస్తోంది. గత వైభవానికి ఆ పార్టీ కృషి చేస్తోంది. అయితే మూడు కీలక పార్టీలు అంతా కలసి సీమ మీద కన్ను వేయడంతో వైసీపీకి ఒక విధంగా సవాల్ అనే అంటున్నారు.