బుల్లితెరపై సందడి చేసే అందాల భామ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో పలు సినిమాల్లో నటించిన రష్మి వాటి ద్వారా పెద్దగా బ్రేక్ అందుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ షో లో రష్మీ అడుగుపెట్టారో అప్పట్నుంచి తన కెరీరే మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న వారిలో రష్మీ కూడా ఒకరు.
కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా వెల్లడించే రష్మీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ నెల రోజుల పాటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు రష్మీ ఓ పోస్ట్ చేస్తూ దాన్ని డిజిటల్ డీటాక్స్ అని పేర్కొన్నారు.
ఆ పోస్ట్ లో ఓ నెల రోజుల పాటూ డిజిటల్ డీటాక్స్ పాటించాలనుకుంటున్నానని ఇప్పటికే వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా చాలా లో గా ఉన్నానని, కొన్ని సార్లు సోషల్ మీడియా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని, అది మన ఆలోచనలపై, మానసిక స్థితిపై చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుందని, అందుకే నెల రోజుల పాటూ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు. మళ్లీ తిరిగి వచ్చే టైమ్ కు ఇప్పటికంటే స్ట్రాంగ్ గా ఉంటానని, డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తానని, అలా రావాలంటే ఇప్పుడు ఉన్న ఎనర్జీని మళ్లీ తిరిగి తెచ్చుకోవాలి, దానికి ఇప్పుడు తనకు ఆత్మపరిశీలన కూడా అవసరమని, ఇది సోషల్ మీడియా ప్రభావం లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఉంటేనే కుదురుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఎలాంటి సిట్యుయేషన్ లోనైనా మీరంతా నన్ను స్ట్రాంగ్ అమ్మాయిగానే చూశారని, కానీ నిజానికి లోపల చాలా కుమిలిపోతున్నానని, అందుకే కొన్ని విషయాలు సర్దుబాటు చేసుకోవాల్సిన టైమొచ్చిందని, మీకు టచ్ లో లేకపోయినా మీరు చూపించే ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉంటాయని ఆశిస్తున్నానని ఎమోషనల్ పోస్ట్ చేశారు రష్మీ. రష్మీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అసలు ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో రష్మిని మిస్ అవుతామని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు రష్మీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ అవాలని కోరుకుంటున్నారు. ఈ నెల రోజులు రష్మీ ఫోటోలను, గ్లామర్ స్టిల్స్ ను అందరూ మిస్ అవడమైతే ఖాయం.