గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో చరణ్ కి జతగా జాన్వి కపూర్ నటిస్తుంది. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పెద్దితో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంది. దేవర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినా కూడా జాన్వి కపూర్ పోర్షన్ మాత్రం ఆమెకు ఏమాత్రం యూజ్ అవ్వలేదు. అందుకే అమ్మడు పెద్ది మీద చాలా హోప్స్ తో ఉంది.
ఐతే పెద్ది సినిమా విషయంలో బుచ్చి బాబుకి చరణ్ కొన్ని రూల్స్ ని పెట్టాడట. సినిమా అనుకున్న విధంగా చేసేలా కంఫర్ట్ జోన్ సిద్ధం చేసిన చరణ్ సినిమా బాగా వస్తుందని మధ్యలో ఆపేసి రెండో పార్ట్ కూడా చేద్దామని ప్లానింగ్ వద్దని అన్నాడట. బుచ్చి బాబుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన చరణ్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఒక సినిమాగానే ముగించమని చెప్పాడట. ఈమధ్య పాన్ ఇండియా సినిమాల్లో రెండు భాగాలు అన్నది ప్యాషన్ అయ్యింది.
ఐతే అందులో కొన్ని పార్ట్ 2 కావాల్సిందే అనిపించేలా ఉండగా మరికొన్ని మాత్రం అసలు ఈ సినిమా రెండు భాగాలు అవసరమా అన్నట్టు ఉంటున్నాయి. అందుకే అలాంటి రిస్క్ తీసుకోకుండా పెద్ది సినిమాను పార్ట్ 1 అండ్ 2 అనేలా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కించాలని చెప్పాడట. చరణ్ సజెషన్స్ ని బుచ్చి బాబు కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నాడని తెలుస్తుంది.
బుచ్చి బాబు చరణ్ ఈ కాంబోలో వస్తున్న పెద్ది మరోసారి చరణ్ స్టామినా ఏంటో తెలిసేలా చేస్తుందని అంటున్నారు. సినిమాకు రెహమాన్ ఇస్తున్న మ్యూజిక్ కూడా సినిమా రేంజ్ పెంచేస్తాయని అంటున్నారు. సో పెద్ది ప్లానింగ్ చూస్తే చరణ్ రేంజ్ మరోసారి గ్లోబల్ రేంజ్ రీచ్ అయ్యేలా వస్తుందనిపిస్తుంది.
స్టార్ సినిమాలు రెండు భాగాలు అనేది ఒక సెంటిమెంట్ గా మారింది. పెద్ది నుంచి చరణ్ దానికి బ్రేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఇప్పటివరకు చరణ్ ఇలా పార్ట్ 2 అంటూ ఏ సినిమా చేయలేదు. అలా రెండు భాగాలు చెప్పాల్సిన కథ వస్తే తప్పకుండా అలా చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒక కథగా చెప్పాల్సిన సినిమాను రెండు భాగాలు చేసి ఫెయిల్ అవ్వడం ఎందుకని ఆడియన్స్ భావిస్తున్నారు. పెద్ది మాత్రమే కాదు నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా చరణ్ ఇదే ప్లానింగ్ తో వస్తాడని అంటున్నారు. చరణ్ పెద్ది తర్వాత నెక్స్ట్ సుకుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా రంగస్థలం 2 అని టాక్. ఐతే అంతకుముందు ఇదే సినిమా హార్త్ రేస్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అన్నారు. త్వరలోనే ఆర్సీ 17 సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుంది.