అదేంటో తెలుగు సినిమా నుంచి కలెక్షన్స్ రావాలనుకుంటారు కానీ ఇక్కడకు వచ్చి ప్రమోషన్స్ చేయమంటే మాత్రం చేయరు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్స్ కొందరు ఇదే పంథా కొనసాగిస్తున్నారు. దళపతి విజయ్ ప్రతి సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. విజయ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అప్పుడెప్పుడో తుపాకి సినిమా టైం లో విజయ్ వచ్చి తెలుగులో ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత ఆయన సినిమాలైతే వస్తున్నాయి కానీ ప్రమోషన్స్ చేయలేదు.
ఐతే ఇప్పుడు దళపతి విజయ్ దారిలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వెళ్తున్నారు. రజినీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక దశలో రజినీ సినిమా వస్తుంది అంటే తెలుగు స్ట్రైట్ సినిమాలు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండేది. ఐతే ఆ తర్వాత రజినీ ఫాం కోల్పోవడంతో ఇక్కడ మార్కెట్ తగ్గింది. అయినా కూడా ప్రతి రజినీకాంత్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.
ఒకప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న టైం లో రజినీకాంత్ వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అది చేయట్లేదు. ఆయన కావాలని అలా చేస్తున్నారా లేదా ఏజ్ వల్ల అలా కుదరట్లేదా అన్న డౌట్ మొదలవుతుంది. రజినీ చేసిన కూలీ సినిమా తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ ఈవెంట్ కి కింగ్ నాగార్జున, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్య రాజ్, శృతి హాసన్ అటెండ్ అయ్యారు. ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వస్తారని అనుకున్నా ఆయన జస్ట్ ఒక వీడియో మెసేజ్ మాత్రమే పంపించారు. తన గోల్డెన్ జూబిలీ ఇయర్ లో వస్తున్న కూలీని ఆదరించాలని అన్నారు రజినీకాంత్. ఐతే రజినీకి తెలుగు వాళ్ల మీద అంత ప్రేమ ఉంటే ఆయన డైరెక్ట్ గా ప్రమోషన్స్ పాల్గొనొచ్చు కదా అని కొందరు అంటున్నారు.
కూలీ ఆగష్టు 14న వస్తుంది.. మరి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి నాగార్జున రాలేదు. నెక్స్ట్ మళ్లీ ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారా లేదా ఇంతటితో సరిపెడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రజినీకాంత్ కూడా తెలుగు ఆడియన్స్ ని ఇలా లెక్క చేయకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. రజినీకాంత్ కూలీ సినిమాలో దేవ పాత్రలో రజినీ.. సైమన్ రోల్ లో నాగార్జున కనిపిస్తారు. సినిమాలో కన్నడ ఉపేంద్ర, బాలీవుడ్ అమీర్ ఖాన్ కూడా నటించారు. సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. రజినీ కూలీ సినిమాలో శృతి హాసన్ నటించగా బుట్ట బొమ్మ పూజా హెగ్దే మోనికా అంటూ స్పెషల్ సాంగ్ చేసింది.