ఊహలు గుసగుసలాడే సినిమాతో 2014లో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా మారింది. నాగ చైతన్య, గోపీచంద్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్ ఇలా పలువురు మీడియం రేంజ్ హీరోలతో పాటు సీనియర్ హీరో రవితేజ వంటి స్టార్‌తోనూ సినిమాలు చేసింది. కానీ యంగ్ స్టార్స్ సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్రలో నటించినా అది పెద్దగా రాశి ఖన్నా కెరీర్‌కి హైప్ తీసుకు రాలేక పోయింది. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు, సన్నగా, నాజూకుగా కనిపించేందుకు చాలానే కష్టపడుతుంది. సన్నగా మారిన తర్వాత టాలీవుడ్‌లో ఈమెకు మంచి ఆఫర్లు దక్కాయి.
టాలీవుడ్‌లో కాస్త గ్యాప్ తర్వాత రాశి ఖన్నా రీ ఎంట్రీకి సిద్ధం అయింది. తెలుగులో ఈమె చివరగా నాగ చైతన్య కి జోడీగా థాంక్యూ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అక్కడ కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఆఫర్లు వచ్చాయి. దాంతో రాశి ఖన్నా కెరీర్ ఖతం అనుకున్నారు. కానీ లక్కీగా టాలీవుడ్‌లో బిగ్ రీ ఎంట్రీ దక్కింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశంను దక్కించుకుంది. మరో వైపు బాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటించే అవకాశంను దక్కించుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుండగా రాశి ఖన్నా సెకండ్ లీడ్‌గా కనిపించబోతుంది. మరో వైపు రాశి ఖన్నా హిందీలో ‘నాగ్ జిల్ల’ అనే సినిమాలో నటించేందుకు ఎంపిక అయింది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశి ఖన్నా జాయిన్ కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన నాగ్ జిల్ల యొక్క టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మృగ్దీప్ లాంబా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సరిగ్గా ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాను 2026 ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
నాగ్‌జిల్ల సినిమాపై రాశి ఖన్నా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. హిందీలో ఈ సినిమా హిట్ అయితే తప్పకుండా ఈ అమ్మడికి స్టార్‌డం దక్కబోతుంది. అంతే కాకుండా హిందీలో రాబోయే మూడు నాలుగు ఏళ్ల పాటు బిజీ బిజీగా ఉండే విధంగా చేతికి ఆఫర్లు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఖచ్చితంగా మంచి ఆఫర్లు దక్కవచ్చు. అదే జరిగితే టాలీవుడ్‌లోనూ ఈమెకు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కెరీర్ ఆరంభం నుంచి అంటే 10 ఏళ్లుగా రాశి ఖన్నా స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కనుక ఈ రెండు సినిమాలతో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. కనుక రాశి ఖన్నాకు 2026 సంవత్సరం అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. మరి రాశి ఖన్నా కోరుకున్నది జరిగేనా అనేది చూడాలి.