ఊహలు గుసగుసలాడే సినిమాతో పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. స్టార్ హీరోలకు ఈ అమ్మడు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేదు. అయినా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడంలో సఫలం అయింది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయం తెల్సిందే. కెరీర్ ఆరంభంలో కాస్త బరువు ఎక్కువగా అనిపించినప్పటికీ ఆ తర్వాత బరువు తగ్గి సన్నగా నాజూకుగా కనిపించింది. బరువు తగ్గడంతో టాలీవుడ్‌తో పాటు, ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ఉండటంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంది.
పేరుకు తగ్గట్టు అందాన్ని రాశి పోసినట్లుగా అనిపించే రాశి ఖన్నా ఆకట్టుకునే రూపంతో అలరిస్తుంది. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది అంటూ ఒక నిరుత్సాహం ఉన్నప్పటికీ టైర్ టూ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేయడం ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకుంది. తెలుగులో ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఆఫర్లు రావడం ద్వారా రాశి ఖన్నా కెరీర్ మళ్లీ పుంజుకున్నట్లు అయింది. పదేళ్లు దాటినా కూడా ఇంకా ఫుల్ బిజీగా ఉన్న రాశి ఖన్నా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆకట్టుకునే అందంతో పాటు నటనతో మెప్పించే రాశి ఖన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది.
తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. క్లీ వేజ్ షో తో మతి పోగొడుతూ, లాంగ్ డ్రెస్‌లో రాశి చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ మేకోవర్‌తో పాటు, మేకప్, డ్రెస్‌కి తగ్గట్లుగా హెయిర్ స్టైల్ ఉండటంతో మెరిసి పోతుంది. రాశి ఖన్నా చూపుతో మతి పోగొడుతోంది అంటూ అభిమానులతో పాటు, అంతా కూడా తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆకట్టుకునే అందంతో పాటు ఎలాంటి ఔట్ ఫిట్‌లో అయినా రాశి ఖన్నా భలేగా ఆకట్టుకుంటుంది. అందుకే రాశి ఖన్నా ఎప్పుడు ఏ ఫోటోలు షేర్ చేసినా కూడా ఆకట్టుకుంటూ ఉంది. అందుకే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు స్టార్ హీరోలు ఈమెకు ఆఫర్లు ఇవ్వకుండా తప్పు చేశారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత తప్పకుండా తెలుగులో రాశి ఖన్నాకు స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయి అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఈమె సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు హిట్ అయితే ఉత్తర భారతంలో కూడా కొన్నాళ్ల పాటు రాశి ఖన్నా సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా తప్పకుండా రాశి ఖన్నా ఆకట్టుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


















