పుట్లూరు (Putlur) టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికి కన్ఫర్మ
కులశేఖర్ రెడ్డి కి అనుకూలంగా ఐ వి ఆర్ ఎస్ సర్వే
పుట్లూరు టిడిపి అధ్యక్ష పదవి కోసం IVRS సర్వే…
కులశేఖర్ రెడ్డి కి అనుకూలం
— ఎమ్మెల్యే బండారు శ్రావణి, జేసీ కుటుంబం సన్నిహితునిగా పేరు
–అసమ్మతికి ఆమడదూరం
పుట్లూరు మండల టిడిపి (Tdp)అధ్యక్ష పదవి కోసం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టినట్లు తెలుగుదేశం అధిష్టానం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఫోన్ చేసి కులశేఖర్ రెడ్డి (బాబు రెడ్డి), సుదర్శన్ నాయుడు, గుత్తా శ్రీనివాసులు నాయుడు లలో ఎవరు అయితే సమర్థవంతంగా పార్టీని నడిపించగలరు అనే విషయమై సర్వే టిడిపి పార్టీ చేపట్టింది.
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మండలంలో ఎప్పుడు పర్యటించిన కులశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ వస్తున్నారు.. దీంతో ఆమె మద్దతు దారులు కులశేఖర్ వైపే మగ్గుచూపుతున్నారు… జేసీ దివాకర్ రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ముఖ్య అనుచరునిగా కొనసాగిన కులశేఖర్ కు మద్దతుగా ఆయన అనుచరులు గెలుపుకు ప్రయత్నిస్తున్నారు… జిల్లాలో ఏ టిడిపి కార్యక్రమం జరిగిన పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తన సొంత వాహనాలు ఏర్పాటు చేసి తరలిస్తుండడం మరో ప్లస్ పాయింట్..!
ఇతర నాయకుల మాదిరి టిడిపి జిల్లా కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చలేదు… వైయస్సార్ పార్టీలో చేరడానికి కొందరు ప్రయత్నించడం లాంటి నీచ రాజకీయాలకు కులశేఖర్ రెడ్డి ఎప్పుడూ దూరంగానే ఉంటూ పార్టీ గెలుపుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ వస్తున్నారు….పార్టీకి వీర విధేయుడుగా ఉంటూ, మండలంలో ఎమ్మెల్యే శ్రావణి ముఖ్య అనుచరునిగా, మండల స్థాయి నాయకునిగా కొనసాగుతున్నారు. దీంతో బీసీ,ఎస్సీ వర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు అందరూ కులశేఖర్ రెడ్డి కే జై కొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది… ఏది ఏమైనా రెండు రోజుల్లో ఎవరికి పుట్లూరు మండల టిడిపి కార్యకర్తలు మద్దతు ఇస్తున్నారు అనే విషయం తేలనుంది.


















