టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన కలిసిన నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతోపాటుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాకు నటీనటులకు అవార్డులు కూడా దక్కాయి. వేలకోట్లలో కలెక్షన్స్ కూడా వచ్చాయి.
ఈ మూవీ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోవడంతో పాటుగా, ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఇకపోతే ఇప్పటికే రెండు భాగాలుగా విడుదల అయిన ఈ సినిమా 3 వ భాగం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు సుకుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఇప్పటికే థియేటర్స్ లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఆడించారు. ఇంటా బయటా తేడా లేకుండా అన్ని చోట్లా మోత మోగించాడు పుష్పరాజ్.
కాగా పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, కానీ పార్ట్ 3 విషయంలోనే కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. పుష్ప 2 అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్ ను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు డైరెక్టర్ సుకుమార్. అప్పట్లో వచ్చిన Where Is Pushpa టీజర్ లోని ఒక్క షాట్ కూడా పుష్ప2 రూల్ లో కనబడలేదు. అలాగే ఇవి ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు సుకుమార్. పార్ట్ 3లో వీటన్నింటికీ ఆన్సర్ ఇస్తానంటున్నారు లెక్కల మాస్టారు. ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్న సుకుమార్ పుష్ప 3 కచ్చితంగా ఉంటుందని అన్నారు. కాకపోతే అది సెట్స్‌పై రావడానికి కాస్త టైమ్ పడుతుంది. అయితే ఈ లోపు అల్లు అర్జున్ అట్లీ సినిమాను పూర్తి చేయనున్నారు. ఇక రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాను సుకుమార్ కూడా కంప్లీట్ చేయనున్నారు. వీటి తర్వాత పుష్ప ర్యాంపేజ్ ఉండే అవకాశముంది. కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం పుష్ప 3కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.