ఒకప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ప్రకాష్ షా, వ్యాపార ప్రపంచంలో ముఖేష్ అంబానీకి కుడి భుజంగా ఉన్నాడు. కానీ ఆయన తన విలాసవంతమైన కార్పొరేట్ జీవితానికి వీడ్కోలు పలికి సరళమైన, ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. 63 సంవత్సరాల వయస్సులో ప్రకాష్ షా సన్యాసం పుచ్చుకున్నారు. అతని భార్య నైనా షా కూడా సన్యాసం తీసుకున్నారు.
40ఏళ్ల క్రితం ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ కంప్లీట్ చేసిన ప్రకాశ్ షా రిలయన్స్ ఇండస్ట్రీలో పలు కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది వైస్ ప్రెసిడెంట్ హోదాలో రిటైర్డ్ అయిన ప్రకాశ్ షా ఇప్పుడు తన మిగిలిన జీవితాన్ని మరోవిధంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఏప్రిల్ 25, 2021న మహావీర్ జయంతి సందర్భంగా ప్రకాశ్ షా, ఆయన భార్య నైనా షా కూడా సన్యాసనం పుచ్చుకున్నారు. జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో జైన తీర్థంకురులలో మహావీరుడి జన్మ కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు.
ఈ దీక్ష తర్వాత వారే పేర్లు మార్చుకున్నారు. ప్రకాశ్ షా దంపతుల కొత్త పేరు..ప్రశాంత్ భూషణ్ విజయజీ మహరాజ్ సాహెబ్, భవ్యనిధి సాద్విజీమహరాజ్ సాహెబ్. వాస్తవంగా జైనమతంలో చిన్న పిల్లల నుంచి వ్రుద్ధుల వరకు సన్యాసం స్వీకరించడమనేది సహజమే. జైన మతం ప్రకారం సన్యాసం స్వీకరిస్తే సుఖాలను హోదాలను విడిచిపెట్టాలి. సంపాదన కాంక్ష ఉండరాదు.
శాహాహారం, ఉపవాస దీక్షలు తప్పనిసరి. ఆవిధంగా దేహాన్ని క్రమక్రమంగా మహానిర్వాణం వైపు తీసుకెళ్తారు. చివరకు ఆ దీక్ష నుంచి మహాప్రస్థానానికి చేరుతారు.తన కార్పొరేట్ కెరీర్‌లో, ప్రకాష్ షా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అనేక పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. వీటిలో జామ్‌నగర్ పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్, పెట్‌కోక్ మార్కెటింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, పదవీ విరమణ సమయంలో, ప్రకాష్ షా వార్షిక జీతం దాదాపు రూ. 75 కోట్లు.
ప్రస్తుతం 64 సంవత్సరాల వయసులో, ప్రకాష్ షా జైన సన్యాసిగా జీవిస్తున్నాడు. దీక్ష తీసుకున్న తర్వాత, అతను పూర్తి నిరాడంబర జీవితాన్ని స్వీకరించాడు. అతను చెప్పులు లేకుండా నడుస్తాడు. సాధారణ తెల్లని దుస్తులు ధరిస్తాడు. తన జీవనోపాధి కోసం భిక్షపై ఆధారపడతాడు. అతని దీక్షా కార్యక్రమం ముంబైలోని బోరివలిలో ఘనంగా పూర్తయింది.
ఏడు సంవత్సరాల క్రితం, అతని పెద్ద కుమారుడు కూడా దీక్ష తీసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ‘భువన్ జీత్ మహారాజ్’ అని పేరు పెట్టారు. ప్రకాష్ షా ఇలా అంటున్నాడు, “చిన్నప్పటి నుండి, నాకు దీక్ష తీసుకోవాలనే కోరిక ఉండేది. దీని నుండి వచ్చే ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతతను ప్రపంచంలోని దేనితోనూ పోల్చలేము. పదవీ విరమణ తర్వాత చాలా మంది విలాసం, విదేశీ ప్రయాణాల గురించి కలలు కంటుండగా, ప్రకాష్ షా, అతని భార్య కోట్ల విలువైన ఆస్తిని వదిలి సంయమనం, ధ్యానం, సాధు జీవితాన్ని ఎంచుకున్నారు. నిజమైన సంతృప్తి భౌతిక సుఖాలలోనే కాదు, ఆధ్యాత్మిక శాంతిలో కూడా లభిస్తుందనే వాస్తవానికి ఈ దశ ఒక ఉదాహరణ.