అందం ఉంది .. వేడి ఉంది.. క్రీగంటి చూపులతో కల్లోలం సృష్టించగలదు.. వలపు బాణాలు విసిరి కుర్రకారును స్పెల్ బౌండ్ చేయగలదు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రగ్య జైశ్వాల్ తెలుగు చిత్రసీమలో వరుసగా అవకాశాల్ని అందుకుంటోంది. `అఖండ` లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన ప్రగ్య, ఇప్పుడు ఎన్బీకే సరసన `అఖండ 2`లోను అవకాశం అందుకుంది. మరోవైపు `టైసన్ నాయుడు` అనే చిత్రంలోను కథానాయికగా నటిస్తోంది. ఒకేసారి టాలీవుడ్ లో క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అదే సమయంలో ప్రగ్య తన అభిమానులకు సోషల్ మీడియాల్లో నిరంతరం టచ్ లో ఉంది. ఈ వేదికపై వరుస ఫోటోషూట్లతో వేడి పెంచుతోంది. తాజాగా ఈ ముంబై బ్యూటీ రెడ్ హాట్ లుక్ లో ప్రత్యక్షమైంది. హాఫ్ షోల్డర్ ఫ్రాక్ లో స్టన్నింగ్ ఫోజులతో గుబులు రేపింది. ప్రగ్య టోన్డ్ బాడీ .. థై థండర్ సొగసులు యూత్ కి స్పెషల్ ట్రీట్. స్టూడియో సెటప్ లో ఫోటోషూట్ ప్రగ్యను మరో స్థాయిలో ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఈ భామ టోన్డ్ బాడీ మెరుపులు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
ప్రగ్య ఇటీవల ముంబైలో తన బెస్ట్ ఫ్రెండ్స్ లక్ష్మి మంచు, రకుల్ ప్రీత్ లతో ఎక్కువగా షికార్లు చేస్తూ కనిపిస్తోందతి. ఆ ముగ్గురూ కలిస్తే రచ్చ రచ్చే. ఇంతకుముందు బీచ్ వెకేషన్ లో బోట్ షికార్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ వైరల్ అయ్యాయి. బికినీ బీచ్ సెలబ్రేషన్, రెస్టారెంట్ పార్టీ, పబ్ లైఫ్.. కాదేదీ జాలీ లైఫ్ కనర్హం.