ప్రగ్యా జైస్వాల్.. సినిమాల కంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ ట్రీట్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అనడంలో సందేహం లేదు. ఇందులో భాగంగానే తాజాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో భాగంగా ఒక రిసార్ట్ కు వెళ్లిన ఈమె.. అక్కడ తన అందాలతో హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ముఖ్యంగా సీబ్లూ, ఎల్లో కలర్ కాంబినేషన్ లో షర్టు, షార్ట్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసిన ఈమె.. మరో ఫోటోలో బికినీ అందాలతో ఆశ్చర్యపరిచింది. ఇంకొన్ని ఫోటోలలో షిప్పులో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు అలాగే రిసార్ట్ లో వారు ఇష్టంగా తీసుకున్న డెసర్ట్ కు సంబంధించిన ఫోటోలను కూడా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం వెకేషన్ లో ఈమె చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ ను చూస్తుంటే ఈమె ఏ రేంజ్ లో వెకేషన్ ని ఆస్వాదిస్తుందో అర్థం అవుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇలా వెకేషన్స్ తో తన మైండ్ ను మరింత రీఫ్రెష్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించిన ఈమె.. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయాన్ని అందుకున్న ఈమె.. క్రమంగా మోడల్గా ఎదిగింది. కళా , సంస్కృతి రంగంలో ఈమె సాధించిన విజయానికి 2014 జనవరి 22న సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం లభించింది . కాలక్రమేనా మోడల్గా అవతరించిన ప్రగ్యా జైస్వాల్ ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలలో పాల్గొని.. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ ను సొంతం చేసుకుంది. మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, డాబర్ వాటిక, ఎఫ్బిబి, రిలయన్స్ డిజిటల్ వంటి పాపులర్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా పనిచేసింది.
ఇక మరొకవైపు సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. 2015లో ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో చిత్రాలు చేసి సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది. అలా 2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచే సినిమాలో హీరోయిన్గా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు ఇందులో ఉత్తమ నటన కనబరిచినందుకు ఈమెకు ఉత్తమ నటి విభాగంలో గద్దర్ అవార్డు కూడా లభించింది. అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.


















