కూటమి సర్కారులోని మంత్రులను పక్కన పెడితే.. ఎమ్మెల్యేల పనితీరు వ్యవహారంపై సీఎం చంద్రబా బు నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి అప్పగించిన టాస్కులను ఎలా పూర్తి చేస్తున్నారు? ఏయే ఎమ్మెల్యే ప్రజలకు చేరువగా ఉన్నారు? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఫస్టు ప్లేస్‌లో ఉండగా.. మిగిలిన వారు వెనుకబడ్డారని చంద్రబాబుకు రిపోర్టులు అందాయి.
వీరిలోనూ హైలెట్ అయిన ఎమ్మెల్యే ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడా.. ఆయనకు ఎదురు లేదు. పైగా.. ఎలాంటి ఆరోపణలు లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద ఆరోపణల నుంచి పంచాయితీల వరకు పలు ఆరోపణలు వస్తున్నాయి. కానీ, రాజమండ్రిరూరల్ నియోజకవర్గంలో ఎలాంటి ఆరోపణలు లేకపోగా.. ప్రజలకు చేరువ అవుతున్నార న్న వాదన వినిపిస్తోంది.
ఇక, తర్వాత స్థానంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నట్టు చెబుతున్నారు. ఈయన కూడా వివాద రహితుడే. పైగా.. అక్రమాలు, దందాలకు కడు దూరంగా ఉన్నట్టు నివేదికలు తేల్చేశాయి. అయితే.. ప్రజల మధ్యకు రావడంలో మాత్రం కొంత తటపటాయిస్తున్నారన్న వాదన ఒక్కటే వినిపిస్తోం ది. అలానే.. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్ కూడా మూడోస్థానంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ, కొన్ని కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవి మినహా.. భాష్యం గ్రాఫ్ బాగుందని తెలుస్తోంది.
ఇక, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పనితీరుపైనా మంచి మార్కులే పడుతున్నాయి. అయితే.. ఆమె కూడా.. ప్రజలను ఇంటికి లేదా పార్టీ కార్యాలయానిక మాత్రమే పిలిపించుకుంటున్నారు. ఇది విడనాడి ప్రజల మధ్యకు వెళ్తే.. బెటర్ అన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేల్లో శింగనమల ఎమ్మెల్యే ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో ప్రశాంతి రెడ్డి ఉన్నారు. మూడో స్థానం మాత్రం ఖాళీగా ఉందని తెలుస్తోంది. సో.. మొత్తానికి మళ్లీ చంద్రబాబు ర్యాంకులు ఇచ్చే కసరత్తును ముమ్మరం చేశారు. మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.