Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు.. అయితే, పోలవరం ఎగువ కాఫర్ డ్యాంపై స్వల్పంగా మట్టి కుంగింది.. వెంటనే అప్రమత్తమై అధికారులు.. కుంగిన ప్రాంతాన్ని పటిష్టపరిచారు.. 10 అడుగుల వెడల్పు, 7 నుండి 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు ఎగువన మట్టి కుంగగా.. వెంటనే స్పందించారు అధికారులు.. గతంలో వచ్చిన వరదల కారణంగా కాపర్ డ్యాంపై మరో రెండు మీటర్లు ఎత్తు పెంచారు అధికారులు.. అయితే, ఎత్తు పెంచిన ప్రాంతంలో మాత్రమే మట్టి జారిందని.. వెంటనే దానిని పటిష్టపరిచామని అధికారులు చెబుతున్నారు..
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం పై మట్టి రాళ్లు స్వల్పంగా కుంగాయి. దీంతో ప్రభుత్వమైన అధికారులు వెంటనే కుంగిన ప్రాంతాన్ని పటిష్ట పరిచారు. దీంతో కాఫర్ డ్యాం పటిష్టతకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2022లో వచ్చిన వరదల కారణంగా డ్యాం మరో రెండు మీటర్లు అదనంగా పెంచారు. పెంచిన ప్రాంతంలో మాత్రం కొద్దిగా మట్టి కుంగడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన దాన్ని పటిష్టపరిచారు. కాపర్ డ్యాం పటిష్టతకు తోడు దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.