పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ హంగామా నెల రోజుల ముందు నుంచే మొదలైంది. సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్, స్టైల్ అన్నీ కూడా వింటేజ్ వైబ్ అందిస్తాయని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి తన హీరోని ఎలా చూపించాలనుకుంటున్నాడో అందుకు తగినట్టుగానే ఉండబోతుంది ఈ మూవీ. ఓజీలో నుంచి వచ్చిన పవర్ స్టోర్మ్ సాంగ్ చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది.
ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్..
ఐతే లేటెస్ట్ గా సినిమా ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైందట. సినిమాకు సంబందిచిన కొందరు ఫస్ట్ హాఫ్ చూసేశారట. ఫస్ట్ హాఫ్ తోనే సినిమా టికెట్ వర్తీ అనిపించేలా ఉందట. సినిమా మీద సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఫస్ట్ హాఫ్ చూసే సూపర్ హిట్ అనేస్తారంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఓజీ ఫస్ట్ హాఫ్ గురించి సోషల్ మీడియాలో స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది.
ఓజీ సినిమాలో ఫస్ట్ హాఫ్ తోనే సుజిత్ సినిమాను పీక్స్ కి తీసుకెళ్లాడని.. ఇంటర్వెల్ సీన్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఓజీ సినిమా విషయంలో ఎక్కడ ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బజ్ ని క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ ఏంటో నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి అంతగా తెలియదు. ఈ సినిమాతో దాన్ని రుచి చూపించాలని ఫిక్స్ అయ్యాడు సుజిత్.
థియేటర్లు దద్దరిల్లిపోతాయి..
అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో అకిరా నందన్ కూడా ఉంటాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అది జరిగితే మాత్రం ఇక థియేటర్లు దద్దరిల్లిపోతాయి. మెగా ఫ్యామిలీ నుంచి మెగా వారసుడిగా చరణ్ తర్వాత పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ కూడా అదరగొట్టేస్తాడని అంటున్నారు. మరి నిజంగానే ఓజీలో అకిరా ఉన్నాడా లేదా అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది.
ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ క్రేజ్ తెస్తుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ అంచనాలు పెంచింది. థమన్ కూడా ఓజీని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లా తీసుకున్నాడు. మరి ఓజీ కి థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడన్నది కూడా ఆదియన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంది.