కూలీ ముందు వరకు లోకేష్ కనకరాజ్ ని ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ వచ్చిన కోలీవుడ్ మీడియా ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో లోకేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తున్నాడన్న డిస్కషన్ పై కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమాకు ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరో లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఈలోగా తమిళ్ నుంచి కాదు తెలుగు నుంచి ఒక స్టార్ హీరో లోకేష్ కనకరాజ్ కు ఛాన్స్ ఇస్తున్నాడన్న న్యూస్ వచ్చింది.
ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అసలైతే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ ఆ మూవీ నిర్మిస్తారని తెలుస్తుంది. ఐతే ఆ ప్రాజెక్ట్ ఏమో కానీ లోకేష్ కనకరాజ్ తో పవన్ కళ్యాణ్ సినిమా అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్, లోకేష్ కాంబో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నారట.
లోకేష్ చెప్పిన కథ నచ్చడంతో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ప్రొసీడ్ అవ్వమని అన్నారట. ఇక పవర్ స్టార్ కి వినిపించడం ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం ఒక్కటే మిగిలింది. పాలిటిక్స్, సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉంటున్నారు. ఉస్తాద్ తర్వాత స్టార్ డైరెక్టర్ తోనే పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుండగా అది లోకేష్ కనకరాజ్ తోనే అని కొందరు అంటున్నారు.
లోకేష్ అంతకుముందు ప్రభాస్ తో సినిమా చేయడం ఇంట్రెస్ట్ గా ఉందని అన్నాడు. అంతేకాదు ఎన్టీఆర్, చరణ్ తో కూడా ఛాన్స్ వస్తే సినిమా చేస్తా అన్నాడు. ఐతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం తప్పకుండా ఫ్యాన్స్ కి మరో విక్రం లాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారని చెప్పొచ్చు.
సుజీత్ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉండగా లోకేష్ కి పవర్ స్టార్ ఛాన్స్ ఇస్తే మరో విక్రం సినిమా ఈసారి దానికి మించి సినిమా చేసే ప్లాన్ ఉంటుందని అంటున్నారు. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. కూలీ తర్వాత అమీర్ ఖాన్ తో సినిమా చేయాల్సిన లోకేష్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా హీరో వేటలో ఉన్నాడు. ఇక మరోపక్క అతను లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తున్నాడు లోకేష్. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక తన డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.


















