ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులంతా ఎంతో నిష్టతో మాసం చేస్తున్నారు. ఉదయాన్నే లేచి తల స్నానం చేయడం అటుపై దీపం పెట్టడం పూజ వ్యవహారాల్లో రెండు పూటలా బిజీగా ఉంటున్నారు. తినే ఆహారం విషయంలో ఎన్నో నియమాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం అంటే? నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. ఉల్లిపాయ వాసన కూడా దరి చేరనివ్వరు. నెల రోజుల పాటు, ఎంతో నిష్టతో ఉంటారు. ఓం నమ: శివాయా? హర హర మహదేవో శంభో అంటూ జపం చేస్తుంటారు.
మరి టాలీవుడ్ లో కూడా అంత భక్తి శ్రద్దతలతో కార్తీక మాసం ఆచరించే నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో నిష్టతో కార్తీక మాసం చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. హిందు సంప్రదాయాలు పాటించడంలో పవన్ ఎంత చొరవ చూపిస్తారో చెప్పాల్సిన పని లేదు. హిందువులు జరుపుకునే ప్రతీ పండగ పవన్ ఇంట జరుగుతుంది. ఆయన సతీమణి రష్యన్ మహిళ అయినా? తాను కూడా తెలుగింట ఆడపడుచులా ముస్తావైన వనం ఎంతో ముచ్చటగా ఉంటుంది. తెలుగు సంప్రదాయాలు ఎంతో పద్దతిగా ఆచరిస్తారు.
పవన్ తో కలిసి అన్నిరకాల హిందు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ మధ్య సనాతన ధర్మం పరిరక్షణ కోసం పవన్ చేసిన పోరాటం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. మెయిన్ టాపిక్ లో కి వస్తే కార్తీక మాసం సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా కూరల్లో ఉల్లిపాయ వేసుకోవడం మానేసారుట. ప్రస్తుతం పవన్ సహా మిగతా సభ్యులంతా కూడా ఉల్లి లేని వంటకాలు మాత్రమే ఆరగిస్తున్నారుట. ఇంటి పని వాళ్లకు కార్తీక మాసం రాగానే పవన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పవన్ ఉదయం అల్పాహారం కూడా తీసుకోవడం లేదట.
నేరుగా మధ్నాహ్నం ఉల్లిలేని వంటకాలతో పాటు, పెరుగు అన్నం తప్పని సరిగా తీసుకుంటున్నారుట. సా యంత్రం మాత్రం అల్పాహారంతో రోజును ముగిస్తున్నారుట. కార్తీక మాసం ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. మరో రెండు వారాల్లో కార్తీక మాసం ముగుస్తుంది. అనంతరం మళ్లీ యదావిధిగా అన్ని వంటకాల్లో ఉల్లి భాగమవుతుంది.


















