ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Pawan Kalyan | అదే తపన..!

Pawan Kalyan | అదే తపన..!
ADVERTISEMENT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అక్షరాలా 18 నెలలు పూర్తి అయింది. అంటే ఏణ్ణర్థం పాలన అన్న మాట. మొత్తం అరవై నెలలు అధికారం ప్రజలు కూటమికి ఇస్తే అందులో 18 నెలలు కంప్లీట్ అయ్యాయి. అంటే ఒక విధంగా మూడవ వంతు పాలన పరిసమాప్తం అయింది అని అంటున్నారు. ఈ పాలనలో టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఈ ఏణ్ణర్థం కాలం ఒక విధంగా చూస్తే కీలకమైన దశగా చెబుతున్నారు. ఒక మైలురాయిగా కూడా చూస్తున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా పరిపాలనా సంబంధమైన విషయాలలో సరైన చర్యలు తీసుకుంటున్నారు. ఠంచనుగా ప్రతీ నెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సుని కూడా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు మొత్తం అన్ని శాఖల మీద సమగ్రమైన సమీక్షగా ఈ కలెక్టర్ల సదస్సు నిలుస్తోంది. ప్రతీ జిల్లాలో పరిపాలనకు మొదటి కేంద్ర బిందువుగా కలెక్టరేట్లు ఉంటాయి కాబట్టి బాబు కలెక్టర్ల సదస్సుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సుదీర్ఘంగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తూ పాలనను మరింతగా ముందుకు నడిపించేందుకు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు అమరావతి రాష్ట్ర సచివాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సుస్థిర అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా చేసుకుంటున్నారు. అంతే కాదు గత 18 నెలల పాలనపై సమీక్షతో పాటు .కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇది కూటమి ప్రభుత్వం పాలనలో జరుగుతున్న అయిదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గా చెబుతున్నారు. ఈ సమావేశంలో నూతన లక్ష్యాలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి మార్గం కూడా చేస్తారు అని తెలుస్తోంది.

ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అభివృద్ధి లక్ష్యాలు వంటి వాటిపై తొలి రోజు సమావేశంలో కీలక చర్చ జరగనుందని చెబుతున్నారు. వీటికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఆయా రంగాల్లో ఎలా పని చేయాలనే విషయమై ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. అలాగే వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో ప్రజల సంతృప్త స్థాయి ఏ మేరకు ఉందనే అంశం పైనా తొలి రోజు సమావేశంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. అలాగే ఇ-ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులు, డేటా డ్రివెన్ గవర్నెన్స్ వంటి అంశాలపై ఐటీ సెక్రటరీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో పథకాల అమలు ఏ విధంగా జరుగుతోంది కేంద్ర నిధులను ఏ మేరకు వినియోగించారు. వీటికి సంబంధించిన యూసీలు ఆయా శాఖలు ఎంత వరకు జారీ చేశారనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. దీంతోపాటు ఏపీలో వివిధ జిల్లాలలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్ని వచ్చాయి, వాటిని అమలు చేసే అంశంపై జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా బాబు వారితో చర్చించనున్నారు. సంక్షేమం ద్వారా సాధికారత సూపర్ సిక్స్ అమలు వంటి అంశాలపై బాబు లోతైన సమీక్ష చేపట్టనున్నారు.

ఇక రెండో రోజు అయిన 18వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కీలకమైన రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక చర్చలో బాబు సమీక్ష చేయనున్నారు అని తెలుస్తోంది. అలాగే ఏపీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోం కార్యదర్శి విశ్వజిత్ సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొననున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఏణ్ణర్థం కాలంలో ఏమి సాధించింది, జిల్లాలలో పనితీరు ఎలా ఉంది, పాలన ఏ విధంగా సాగుతోంది అన్నది ఈ కలెక్టర్ల సదస్సు ద్వారా తెలియనుంది.

Tags: #18monthsinpower#AndhraPradesh#AndhraPradeshGovernment#AndhraPradeshPolitics#APNews#Chandrababu#GovernanceReview#Tdp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bengaluru |డిజిటల్ అరెస్టు..రూ.2.05 కోట్లు కొల్లగొట్టిన ఉదంతం!

Next Post

Chandrababu | 18 నెలల కూటమి పాలన..లాభమెంత..నష్టం ఎంత..?

Related Posts

NehaSharma
Entertainment

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

RevanthReddy
Big Story

RevanthReddy:కేరళ ఎన్నికల ఫలితాలు 2026, కాంగ్రెస్ ఘన విజయం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రభావం

TamilNaduElections
Big Story

TamilNaduElections:టీవీకే సంచలనం, విజయ్ సీఎం అవకాశాలు డీఎంకే DMK ఓటమి విశ్లేషణ

#BengalElections, #WestBengalPolitics, #IndianPolitics, #ElectionResults, #PoliticalAnalysis, #BJP, #TMC, #DemocracyIndia, #BreakingNews, #TrendingPolitics, #IndiaNews, #Election2026, #PoliticalChange, #PublicOpinion, #NationalPolitics, #ViralNews, #TeluguNews, #PoliticalDebate, #LatestUpdates
Big Story

BengalElections:మమత ఓటమి వెనుక అసలు కారణాలేమిటి? బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలకు ఇచ్చిన పెద్ద సందేశం

TamilNaduPolitics
Big Story

TamilNaduPoliticsL:విజయ్ డబుల్ విజయం తర్వాత త్రిష రాజకీయ ఎంట్రీ హాట్ టాపిక్ – తమిళనాడులో డిప్యూటీ సీఎం చర్చలు వేడెక్కుతున్నాయి

Next Post
Chandrababu | 18 నెలల కూటమి పాలన..లాభమెంత..నష్టం ఎంత..?

Chandrababu | 18 నెలల కూటమి పాలన..లాభమెంత..నష్టం ఎంత..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NehaSharma

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

NaraLokesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

RevanthReddy

RevanthReddy:కేరళ ఎన్నికల ఫలితాలు 2026, కాంగ్రెస్ ఘన విజయం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రభావం

TamilNaduElections

TamilNaduElections:టీవీకే సంచలనం, విజయ్ సీఎం అవకాశాలు డీఎంకే DMK ఓటమి విశ్లేషణ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info