ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Paster praveen kumar Death :ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారన్న పోలీసులు

Paster praveen kumar Death :ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారన్న పోలీసులు
ADVERTISEMENT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌ స్టాప్‌ పెట్టారు. మద్యం మత్తులో బైక్‌ నడిపి… సెల్ఫ్ యాక్సిడెంట్ జరగడం వలనే ప్రవీణ్‌ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేసారు. ఈ మేరకు పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… ‘‘హైదరాబాద్‌ నుంచి పాస్టర్‌ ప్రవీణ్(Pastor Praveen Kumar) బైక్‌ మీద బయల్దేరారు. అరోజు ప్రవీణ్‌ కుమార్‌ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్‌ కొనుగోలు చేశారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్‌ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్‌ ప్రవీణ్ ‌కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్‌ కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్‌ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.

పాస్టర్ ప్రవీణ్‌ హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్‌ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక చెప్పింది. కీసర టోల్‌ ప్లాజా వద్ద ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్‌, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరప్పాడు జంక్షన్‌ వద్ద ప్రవీణ్‌ పరిస్థితిని ఆటో డ్రైవర్‌ చూశారు. ట్రాఫిక్‌ ఎస్సై సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్‌ బాగోలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్‌లైట్‌ పగిలిపోవడంతో రైట్‌సైడ్‌ బ్లింకర్‌ వేసుకునే ప్రయాణించారు.

ఏలూరులో(Eluru) ఆయన మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్‌(Pastor Praveen Kumar) కళ్లజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరు పైవంతెనపై కూడా ఆయన వేగంగా వెళ్లారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్‌ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆయన బుల్లెట్‌ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. బైక్‌ కు, పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్‌ ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ అని ఏలూరు డీఐజీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు.

బండి పడిపోవడానికి గల కారణాలు ఫోరెన్సిక్ వారు స్పష్టంగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆయన సుమారు 70 కిలోమీటర్ల వేగంతో బండి డ్రైవ్ చేస్తున్నారు.‌ప్రమాదం జరిగిన సమయంలో బండి నాలుగవ గేర్ లో ఉందని తెలిపారు. గతంలో కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన మద్యం షాపులో మద్యం కొనుగోలు చేశారు.హైదరాబాదు నుంచి రాజమండ్రి చేరుకునేసరికి మధ్యలో ఆయన ఆరుసార్లు ఫోన్ మాట్లాడారు. మార్గమధ్యంలో ఆయన నాలుగుసార్లు ఫోన్ పే వాడారు. ఆయన శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారన్నారు. ఆయనకు తగిలిన దెబ్బలు రోడ్ యాక్సిడెంట్ వల్ల తగినట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ పగడాల యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లుగా నిర్ధారణ అయిందన్నారు.

Tags: #ChristianCommunity#LatestNews#PastorNews#PastorPraveenKumar#PraveenKumarDeath#PrayersForPraveen#RIPPraveenKumar#RoadAccident#TelanganaNews#TragicLoss
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: కుమారుడితో ఇండియాకి

Next Post

Vizag: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Related Posts

Telangana
Big Story

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Political Revenge
Andhra Pradesh

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

#EVM, #BallotPaper, #VVPAT, #ElectionReforms, #IndianDemocracy, #AndhraPradeshPolitics, #MunicipalElections, #OnlineVoting, #ElectionCommission, #NarasingaReddyChandamuri
Andhra Pradesh

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

AP Politics, YS Jagan, Chandrababu Naidu, Narendra Modi, Sajjala Ramakrishna Reddy, YSRCP, TDP, BJP, Congress, NDA Alliance, Andhra Pradesh Politics
Andhra Pradesh

YSRCP:మోదీని వదిలితే జగన్‌కు రాజకీయంగా లాభమా? వైసీపీ భవిష్యత్తుపై చర్చ

#KadiriMunicipality, #KadiriPolitics, #ArpiaBhanu, #AttarParveen, #TDP, #YSRCP
Andhra Pradesh

KadiriMunicipality:కదిరి మున్సిపల్ చైర్మన్ పోరు ఆసక్తికరం.. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

Next Post
Vizag: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Vizag: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Political Revenge

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

#EVM, #BallotPaper, #VVPAT, #ElectionReforms, #IndianDemocracy, #AndhraPradeshPolitics, #MunicipalElections, #OnlineVoting, #ElectionCommission, #NarasingaReddyChandamuri

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

AP Politics, YS Jagan, Chandrababu Naidu, Narendra Modi, Sajjala Ramakrishna Reddy, YSRCP, TDP, BJP, Congress, NDA Alliance, Andhra Pradesh Politics

YSRCP:మోదీని వదిలితే జగన్‌కు రాజకీయంగా లాభమా? వైసీపీ భవిష్యత్తుపై చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info