ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్ – అరుణ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కరుడుగట్టిన నేరస్తుడిగా.. జీవిత ఖైదుగా ఉన్న నేరస్తుడికి పెరోల్ రావటం ఒక ఎత్తు అయితే.. అతడ్ని బయటకు తీసుకురావటంలో అరుణ టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ ప్రియురాలిగా కొందరు.. కాదు భార్యే అంటూ మరికొందరు చెబుతున్న వైనం కొత్త రచ్చగా మారింది. జిల్లా ఎస్పీలు శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసినా.. హోంశాఖను ఒత్తిడికి గురి చేసి.. చివరకు తాను అనుకున్నట్లుగా శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించిన అరుణ టాలెంట్ అచ్చెరువు పొందేలా మారింది.
హత్య కేసులో జీవితఖైదులో ఉన్న వ్యక్తిని పెరోల్ లో బయటకు తీసుకొచ్చిన వైనం ఒక ఎత్తు అయితే.. అలా బయటకు వచ్చిన శ్రీకాంత్ తో అరుణ విందులు.. వినోదాలు.. సన్నిహితంగా ఉన్న వేళలలో ఉన్న వీడియోలు బయటకు రావటం కలకలాన్ని రేపింది. దీంతో.. స్పందించిన కూటమి సర్కారు.. శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడికి అక్రమ పద్దతిలో పెరోల్ ఇప్పించిన అరుణను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు కారు డిక్కీలో కూర్చొని సెల్పీ వీడియో తీసుకున్న అరుణ.. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు.. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసు శాఖను ఇంతలా ప్రభావితం చేసేలా అరుణకు ఉన్న పరపతి ఏమిటి? పోలీసు యంత్రాంగాన్ని తాను అనుకున్నది అనుకున్నట్లుగా పనులు ఎలా చేయించగలుగుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న దానిపై కొత్త చర్చ మొదలైంది. అవిలేలి శ్రీకాంత్ సొంతూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు. వైసీపీలో కొంతకాలం ఉన్న అతను తర్వాతి కాలంలో టీడీపీలో పని చేశారు. ఇతడో గ్యాంగ్ ను మొయింటైన్చేస్తూ.. బ్లాక్ మొయిల్ మొదలు పలు దందాలు చేసేవారని ఆరోపిస్తున్నారు . ఇతడి నేరాల చిట్టా తరుపతి.. నెల్లూరు జిల్లాల్లో భారీగా ఉంటాయని చెబుతారు. ఒక హత్య కేసులో అతను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జీవితఖైదు విధించారు. 2010 నుంచి నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదుగా ఉన్న అతను.. 2014లో సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకున్నాడు.
దాదాపు నాలుగున్నరేళ్ల పాటు తప్పించుకు తిరిగిన శ్రీకాంత్ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. జైల్లో ఉంటూనే అతను 60కు పైగా తీవ్రమైన నేరాల్లో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ ఉంది. గత ఏడాది ఎన్నికల వేళలో టీడీపీ నేతపై జరిగిన హత్యాయత్నం వెనుక కూడా శ్రీకాంత్ హస్తం ఉందన్నమాట బలంగా వినిపిస్తూ ఉంది. ఇక.. శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ గురించి కథలు కథలుగా చెబుతారు. ఆమె ప్రియురాలు కాదు.. శ్రీకాంత్ భార్యగా కొందరు చెబుతారు.అయితే.. వారిద్దరు పెళ్లి చేసుకున్న ఆధారాలు లేవని చెబుతారు. ఆమె 2002 నుంచి ఒక ఎన్జీవోను రన్ చేస్తుంటారని.. సదరు సంస్థ జైల్లోని ఖైదీల కోసం పని చేస్తుంటారని చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ఆమె గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ పెరోల్ కోసం దాదాపు రూ.12 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా ఆమే స్వయంగా చెప్పుకోవటం సంచలనంగా మారింది. దీనికి తోడు.. శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకురావటం.. తప్పుడు విధానాలతో పెరోల్ తీసుకున్న వైనాన్ని రాష్ట్ర హోంశాఖ గుర్తించింది. తన ప్రియుడు శ్రీకాంత్ ను బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఆమె చేసిన ప్రయత్నాల్నితిరుపతి.. గూడూరు డీఎస్పీ.. సీఐతో పాటు నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ లు రాష్ట్ర హోం శాఖకు విన్నవించిన తర్వాత కూడా జులై 30న శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయటం సంచలనంగా మారింది. దీని వెనుక అరుణ మేజిక్ ఉందని చెబుతున్నారు. అయితే.. శ్రీకాంత్ పెరోల్ అంశం రచ్చ కావటం..చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయం హైలెట్ కావటంతో శ్రీకాంత్ కు మంజూరు చేసిన పెరోల్ రద్దు అయ్యింది. అసలీ ప్రాసెస్ ఎలా జరిగిందన్న అంశంపై హోంశాఖ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో అరుణ లీలలు తెర మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే డబ్బు.. కాదంటే మరేదైనా సరే.. ఇవ్వటం ద్వారా అరుణ తన పనుల్ని పూర్తి చేస్తారని చెబుతున్నారు. హోంశాఖలో అరుణకు ఉన్న పలుకుబడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన ప్రియుడికి జారీ చేసిన పెరోల్ రద్దు వేళ.. ఫస్ట్రేషన్ కు గురైన అరుణ.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పెరోల్ జీవోను రద్దు చేయటం హోంశాఖ చరిత్రలోనే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు. తనపైనా.. శ్రీకాంత్ పైనా సోషల్ మీడియాలోనూ.. టీవీ చానళ్లలో వస్తున్న కథనాలతో నిజం లేదని వాదిస్తున్న అరుణ.. మరో అడుగు ముందుకు వేసి.. మమ్మల్ని వాడుకొని వదిలేశారని.. ఇప్పుడు మాపైనే విష ప్రచారం చేస్తున్నారు. నేతల బండారం బయటపెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇన్ని నిందలు మోపుతుంటే మౌనంగా ఉండాలా? ఇంకా బాధలు పడాలా? ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు? మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా.. దేనికైనా సిద్ధపడిపోవటమే మేలు’ అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పోలీసు శాఖలో ఆమెకున్న పట్టు ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తుంది. ఆమె నోరు విప్పితే తమ పరిస్థితి ఏమిటి? అన్నది ఏపీ పోలీసుశాఖలో జరుగుతున్న చర్చ సంచలంనగా మారింది.
ప్రభుత్వం ఎవరిదైనా కావొచ్చు.. తప్పులు జరగటం సహజనం. అయితే.. జరిగిన తప్పును సకాలంలో సరి చేసుకునేలా ఆదేశాలు జారీ చేయటం అత్యవసరం.ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం తాను ఆ లైన్ లోనే ఉన్నానన్న విషయాన్ని తన చేతలతో స్పష్టం చేసిందని చెప్పాలి. అయితే.. వైసీపీ నేతలు.. కార్యకర్తలు మాత్రం ఈ ఉదంతంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.అయితే.. ఇందులో పస కంటే నసే ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..
టీడీపీకి చెందిన శ్రీకాంత్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు. హత్య కేసులో జీవిత ఖైదీగా జైల్లో ఉన్నాడు. టీడీపీకి చెందిన ఒక క్రీయాశీలక నేతగా ఉన్న ముఖ్యనేతకు నమ్మకస్తుడు. జీవిత ఖైదీగా ఉన్న అతను.. తరచూ పెరోల్ మీద బయటకు రావటం విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా అతడికి పెరోల్ మంజూరైంది. ఇలాంటి వేళలోనే.. హత్య కేసులో శిక్ష పడిన వ్యక్తి ఇంత తరచూ పెరోల్ మీద బయటకు రావటం ఏమిటన్నది చర్చగా మారింది. అదే సమయంలో అతడికి సన్నిహితంగా ఉండే నిడిగుంట అరుణకు చెందిన ఫోటోలు కొన్ని వెలుగు చూడటం.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై అరుణ తీవ్రంగా స్పందిస్తూ..కొందరు టీడీపీ నేతలు ఆర్య మీద పగబట్టి..ఈ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లుగా ఆరుణ ఆరోపించారు. తాను మౌనంగా ఉంటే తన ప్రతిష్ట దిగజారిపోతుందని..అందుకే తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ద్వారా అందరికి విషయాన్ని అర్థమయ్యేలా చేయాలన్నది అరుణ భావనగా చెబుతున్నారు.
ఈ ఉదంతంతో కదిలిన పోలీసు యంత్రాంగం పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి మంజూరు చేసిన పెరోల్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతంపై టీడీపీ నేతల వాదన.. వైసీపీకి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. తమ ప్రభుత్వంలో తప్పులు జరిగిన అంశం వెలుగు చూసినంతనే చర్యల కత్తికి పదును పెడతారన్న వాదనను వినిపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వర్గాల వాదన వేరుగా ఉంది. జీవిత ఖైదీగా ఉన్న నేరస్తుడు తరచూ పెరోల్ మీద బయటకురావటం..అతను బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీకి చెందిన ఒక మంత్రి.. ముగ్గురు ఎమ్మెల్యేల ఒత్తిడితోనే హోంశాఖ స్పందించి అతడ్ని జైలు నుంచి పెరోల్ విడుదల అయ్యేలా చేసినట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే.. విమర్శలు తెర మీదకు వచ్చిన ఐదు రోజుల్లోనే శ్రీకాంత్ పెరోల్ రద్దు కావటం.. తిరిగి జైలుకు వెళ్లేలా ఆదేశాలు జారీ అయిన వైనాన్ని చూసినప్పుడు కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చేసిందని చెప్పాలి. ఇదే విషయాన్ని ఏపీ హోంమంత్రి చెబుతూ.. శ్రీకాంత్ కు తమ ప్రభుత్వమే పెరోల్ వచ్చిందని.. అయితే అతడి క్రిమినల్ రికార్డు ఉందన్న విషయాన్ని జైలు అధికారులు చెప్పినంతనే పెరోల్ ను రద్దు చేసినట్లుగా వెల్లడించారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతుందన్న హోం మంత్రి అనిత.. టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖకు పెరోల్ మంజూరు చేయాలనే సిఫార్సు మీరే చేశారుగా అన్నప్పుడు మాత్రం దానికి సమాధానం ఆమె ఇవ్వలేదు. కాకుంటే.. విమర్శలు వెల్లువెత్తిన వెంటనే దాన్ని రద్దు చేయటం ఇప్పుడున్న రాజకీయాల్లో అరుదైన అంశంగా చెబుతున్నారు. ఏమైనా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు వేగంగా ఉండటం చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ను పెంచుతుందని చెప్పక తప్పదు