ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ పెళ్లి , పిల్లల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు.అయితే కొంతమందేమో కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి లేటుగా చేసుకోవడంతో పాటు పిల్లల్ని కూడా లేటుగానే కంటున్నారు. కానీ మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లి కరెక్ట్ ఏజ్ లోనే చేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా కరెక్ట్ ఏజ్ లోనే కంటున్నారు. ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తున్నారు. అలా తాజాగా మరొక బ్యూటీ తల్లి కాబోతున్నాను అనే గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. మరి తల్లి కాబోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు పరిణీతి చోప్రా..
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తాజాగా తాను తల్లి కాబోతున్నాను అనే గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంది.. ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంటూ “ఓ వెండి పళ్లెంలో అందంగా ఉండే ఓ కేకులో చిట్టి పాదాలతో పాటు 1+1=3 అంటూ ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాం” అంటూ ప్రెగ్నెన్సీ కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియోలో.. పరిణితి చోప్రా, రాఘవ చద్దా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు.వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నారు. అలాగే మా లిటిల్ యూనివర్స్ వస్తుంది అంటూ ఎమోజీ బొమ్మల్ని కూడా షేర్ చేసుకున్నారు. అలా ఫైనల్ గా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నాం అనే గుడ్ న్యూస్ ని పంచుకున్నారు.
ఇక పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల విషయానికి వస్తే.. 2023లో పెళ్లి చేసుకున్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇద్దరు గత రెండు సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ మధ్య ఉన్న ప్రేమని ప్రతి సందర్భంలో బయట పెడుతూ వస్తున్నారు. ఇక 2012 నుండి బాలీవుడ్ సినిమాల్లో రాణిస్తున్న పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయినటువంటి రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి తర్వాత కూడా పరిణితి చోప్రా పలు సినిమాల్లో నటించింది.
ఇక గత కొద్ది రోజులుగా కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోయినప్పటికీ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు అందరూ ఖుషి అవుతున్నారు. ఇక వీళ్ళు పెట్టిన పోస్ట్ చూసిన చాలామంది నెటిజెన్లు,అభిమానులు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ తెలియజేస్తున్నారు. అయితే పరిణితి చోప్రా రాఘవ చద్దాల గురించి ఇప్పటికే పలు ప్రెగ్నెన్సీ రూమర్లు వినిపించాయి. పెళ్లయి ఏడాది కాకముందు నుండే పరిణితి చోప్రా ప్రెగ్నెన్సీ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఫైనల్ గా ఈ జంట పేరెంట్స్ కాబోతున్నాం అనే గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు.