పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ (They Call Him OG)”. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సెప్టెంబర్ 25, 2025న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సునామీలా దూసుకుపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఓజీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస కలిసి అందించగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. ఎస్ థమన్ తన థండర్ బీట్‌లతో థియేటర్లను షేక్ చేశారు. ప్రతి సీన్‌లోనూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మేకింగ్ కనిపించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకు వెయిట్ ఉండటం, పవన్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో థియేటర్లు షేక్ అయ్యాయి.
రిలీజ్‌కి ముందే “ఓజీ” ట్రేడ్ సర్కిల్స్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ రూ. 80 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 55 కోట్ల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 157 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక హక్కులు రూ. 8 కోట్లు, తమిళ, కేరళలో హక్కులు రూ. 3 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రేమియర్స్ ద్వారానే సుమారు రూ.22 కోట్లు రాబట్టిన ఓజీ, మొదటి రోజు రూ.67 కోట్లు ( ఇండియా వైడ్ గా నెట్) వసూలు చేసింది. ఇక మొదటి వారం మొత్తంగా రూ.169.3 కోట్లు ( ఇండియా నెట్) కలెక్ట్ చేయగా.. రెండు వారాల్లో ఇండియా వైడ్‌గా రూ.188 కోట్లు (నెట్), గ్రాస్ రూ.226 కోట్లు అందుకుంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 316 కోట్లు చేరుకుంది. 3వ వారం ఓజీ కలెక్షన్స్ క్రమంగా తగ్గడంతో చివరికి ఓజీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల ఫైనల్ గ్రాస్ కలెక్షన్ వద్ద ఆగింది.
ఓజీ ఇండియా వైడ్ గా నెట్ కలెక్షన్లు చూస్తే.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ. 187.6 కోట్లు సాధించగా, తమిళం రూ. 1.08 కోట్లు, హిందీ రూ. 3.32 కోట్లు, కర్ణాటక రూ. 0.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు కలిపి రూ.5 కోట్లకు పైగా వసూలు చేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఓజీకి అద్భుత స్పందన లభించింది. దాదాపు రూ. 70 కోట్లు వరకు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచే సుమారు మూడో వంతు గ్రాస్ వచ్చింది.
ఓజీ మొదటి రెండు వారాల వరకు సునామీలా దూసుకెళ్లిన కాంతార 2 రిలీజ్‌తో కొంత స్లో అయ్యింది. 3వ వారం కల్లా కలెక్షన్లు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో ఓజీ లైఫ్ టైమ్ గ్రాస్ రూ. 340 కోట్ల వద్దకు చేరింది. ఇలా పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే.. ప్రీ బిజినెస్ పరంగా చూస్తే.. డిస్ట్రిబ్యూటర్ రేంజ్‌లో కొంత నష్టం ఉన్నప్పటికీ, ఓటీటీ, సాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్‌లో ఉన్నారని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

















