పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ప్రజలలో కూడా మరింత గుర్తింపును అందుకున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. మరొకవైపు అభిమానులను మెప్పించడానికి వరుస సినిమాలు ప్రకటిస్తూ..ఆ సినిమాలను విడుదల చేస్తూ మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ (Jyothi krishna) దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఏం. రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్ తో నిర్మించారు
ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘సాహో’ సినిమా చేసి మంచి గుర్తింపు అందుకున్న డైరెక్టర్ సుజీత్(Sujeeth ) దర్శకత్వంలో ‘ఓజీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan)హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు జరగబోతోంది? అంటూ అభిమానులలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే హైదరాబాదులో ఈ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వర్షం వస్తే శిల్పకళా వేదికగా ఈవెంట్ జరుగుతుందని.. వర్షం రాకపోతే ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుందని ఇప్పటికే రెండు వెన్యూలలో పర్మిషన్ తీసుకొని రెడీగా ఉన్నారట. అయితే కాసేపట్లో నిర్ణయం వస్తుంది అని ఎదురు చూడగా.. ఫైనల్ గా ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ను నేరుగా కలుసుకోవాలని, చూడాలని కోరుకుంటున్న అభిమానులకు ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రేపు హైదరాబాదులో ఎల్బీ స్టేడియం వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు చిత్ర బృందం.
ఇకపోతే ఈ సినిమాలో శ్రేయా రెడ్డి కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఈ సినిమాలో సుజీత్ చాలా గ్లామర్ పాత్రలో చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమెను ఈ సినిమాలో ఒక మాస్ లుక్ లో చూపిస్తూ.. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఇందులో గీత అనే పాత్రలో నటిస్తోంది అంటూ స్పష్టం చేశారు. ఈ పోస్టర్ లో మాస్ లుక్ లో గన్ను పట్టుకొని మరీ కనిపించింది శ్రేయా రెడ్డి. మొత్తానికైతే ఊహకందని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.