ఏపీలోని కూటమి ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి.. పలు జిల్లాలకు కొత్త డైరెక్టర్లను నియమించింది.
ఈ నియామకాలు రాష్ట్రంలోని పుస్తకాల సంస్కృతి, విద్యాభివృద్ధి, ప్రజల్లో పఠన అలవాట్లను ప్రోత్సహించేందుకు కీలకమని ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నియమితులైన డైరెక్టర్లు జిల్లాల వారీగా గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. గ్రంథాలయాల్లో సదుపాయాల కల్పన, డిజిటల్ లైబ్రరీల అభివృద్ధి, ఈ-లైబ్రరీ సౌకర్యాల ఏర్పాటు, పుస్తకాల సరఫరా వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
విశాఖపట్నం జిల్లా – డా. కె. సోమశేఖర్ రావు
బొబ్బిలి, విజయనగరం జిల్లాలు – రౌతు రామమూర్తి
గుంటూరు జిల్లా – మగతాల పద్మజ
తిరుపతి జిల్లా – డా. వెంకట రామయ్య
గ్రంథాలయాల ఆధునీకరణపై దృష్టి..
కొత్తగా నియమితులైన డైరెక్టర్లు జిల్లాల వారీగా గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. గ్రంథాలయాల్లో సదుపాయాల కల్పన, డిజిటల్ లైబ్రరీల అభివృద్ధి, ఈ-లైబ్రరీ సౌకర్యాల ఏర్పాటు, పుస్తకాల సరఫరా వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
మరోవైపు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి.. ఆన్‌లైన్ రీడింగ్ రూమ్‌లు, ఆడియోబుక్స్, ఈ-పేపర్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థులకే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కోసం మొబైల్ లైబ్రరీ సేవలు ప్రారంభించే యోచనలో కూడా ఉందని సమాచారం.